భూ సేకరణకు రైతులు సహకరించాలి
ABN, Publish Date - Jul 24 , 2025 | 01:00 AM
మండలంలోని బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పూర్తికి భూ సేకరణ కు రైతులు పెద్ద మనసుతో సహకరించాలని ఎమ్మె ల్యే వేముల వీరేశం విజ్ఞప్తి చేశారు.
భూ సేకరణకు రైతులు సహకరించాలి
ఎమ్మెల్యే వేముల వీరేశం
బీవెల్లెంల ఉదయసముద్రం నుంచి కుడి కాల్వకు నీటి విడుదల
నార్కట్‌పల్లి, జూలై 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పూర్తికి భూ సేకరణ కు రైతులు పెద్ద మనసుతో సహకరించాలని ఎమ్మె ల్యే వేముల వీరేశం విజ్ఞప్తి చేశారు. నార్కట్‌పల్లి మండలంలోని బీ.వెల్లెంల జలాశయం కుడికాల్వకు బుధవారం ఆయన నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. అ నంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రాహ్మణవెల్లెంల కాల్వల నిర్మాణం పూర్తయితే ఎన్నికల్లో ఇ చ్చిన హామీ మేరకు నకిరేకల్ నియోజకవర్గంలోని 62వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్ర భుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. కుడికాల్వకు నీటి విడుదల ద్వారా నార్కట్‌పల్లి మండలంలోని గోపలాయపల్లి, నార్కట్‌పల్లి, ఎం.ఎడవల్లి, ఏపీలింగోటం, గచ్చబావి చెరువులను నింపుతామన్నారు. తీ వ్ర వర్షాభావ నేపథ్యంలో పత్తి, వరి పంటలను కా పాడేందుకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఐదురోజుల ముందుగానే కాల్వకు నీటి విడుదల చేసినట్లు తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు సాగునీటిని అందించడం లో విఫలమైందని, బీ.వెల్లెంల ప్రాజెక్టుపై వివక్ష చూపిందని అన్నారు. కాల్వల నిర్మాణంలో భూమిని కోల్పోతున్న రైతులకు సమయోచితంగా తగిన న్యా యం చేస్తామని, వారికి అండ గా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు, కాల్వల నిర్మాణ పను ల్లో ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేసి న ఈఈ గంగం శ్రీనివా్‌సరెడ్డి, డీఈఈ విఠలేశ్వర్‌ల ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంత రం ప్రాజెక్టు ఈఈ గంగం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడు తూ రోజుకు 150 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు ఈఈ శ్రీనివా్‌సరెడ్డి తెలిపా రు. రైతులు నీటిని వృఽథా చేయకుండా సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు నా ర్కట్‌పల్లి ఆర్టీసీ డిపో పునరుద్ధరణలో భాగంగా కే టాయించిన 3 పల్లె వెలుగు బస్సులను నల్లగొండ ఆర్‌ఎం జానరెడ్డితో కలిసి ఆయన జెండా ఊపి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపోను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామన్నారు. డిపో పరిఽధిలో నిరర్థకంగా ఉన్న స్థలాన్ని వాణిజ్య సముదాయం నిర్మిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. అనంతరం లారీ అసోసియేషన నూతన కార్యవర్గా న్ని ఎమ్మెల్యే అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో ఇనచార్జి డీఎం శ్రీనాథ్, ఏఈఈ నవీనకుమార్, కాం గ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఊశయ్య, నా యకులు ఐతరాజు యాదయ్య, దూదిమెట్ల సత్తయ్య, బండ సాగర్‌రెడ్డి, వడ్డే భూపాల్‌రెడ్డి, పాశం శ్రీనివా్‌సరెడ్డి, సట్టు సత్తయ్య, నేతకాని కృష్ణయ్య, పుల్లెంల అ చ్చాలు, జెరిపోతుల భరత, వేముల నర్సింహ, స త్యం, సామ నరేందర్‌రెడ్డి, సిద్దగోని స్వామిగౌడ్, గోసుల భద్రాచలం, వాసుదేవ్, సమద్, నవీన, శశిధర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, బిక్షపతి, శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 01:00 AM