ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

ABN, Publish Date - May 14 , 2025 | 11:52 PM

ధాన్యం కొనుగోలు చేయాలని కోరు తూ బుధవారం రైతులు ధర్నాకు దిగి రోడ్డెక్కారు. మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సకాలంలో కొను గోలు చేయడం లేదని పేర్కొంటూ చెన్నూరు-మంచిర్యాల ప్రధాన రహదారి కిష్టంపేట వద్ద ధర్నాకు దిగి ఆందోళన చేశారు.

చెన్నూరు మంచిర్యాల ప్రధాన రహదారి కిష్టంపేట వద్ద ధర్నా చేస్తున్న రైతులు

చెన్నూరు, మే 14 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు చేయాలని కోరు తూ బుధవారం రైతులు ధర్నాకు దిగి రోడ్డెక్కారు. మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సకాలంలో కొను గోలు చేయడం లేదని పేర్కొంటూ చెన్నూరు-మంచిర్యాల ప్రధాన రహదారి కిష్టంపేట వద్ద ధర్నాకు దిగి ఆందోళన చేశారు. రైతులు మాట్లాడుతూ అకా ల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నా అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లో సకా లంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నామని వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట 4 నుంచి 5 కిలోల వడ్లను దోచుకుంటున్నారని వారన్నారు. ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదా లు చేస్తూ నిరసన తెలిపారు. కలెక్టర్‌ వచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకుకూర్చోవడంతో ఎటు వాహనాలు అటే నిలిచిపోయి ట్రా ఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న దేవేందర్‌రావు చేరు కుని ధర్నా చేస్తున్న రైతులను శాంతింపజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విర మించారు. ధర్నాలో కిష్టంపేట, ఎల్లక్కపేట, సుద్దాల గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 11:52 PM