ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:20 PM
రైతులు కష్టపడి చమటోర్చి పండించిన ధాన్యంను కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు ఐదు కిలోల దండి కొడుతున్నారని ఇది చాలా అన్యాయం అన్నారు
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
లక్షెట్టిపేట, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): రైతులు కష్టపడి చమటోర్చి పండించిన ధాన్యంను కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు ఐదు కిలోల దండి కొడుతున్నారని ఇది చాలా అన్యాయం అన్నారు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు. బుధవారం లక్షెట్టిపేట మం డలం గుల్లకోట గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొను గోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి ఇబ్బం దులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అధికారులు ఏలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పినా కేంద్రం ని ర్వాహకులు మాత్రం సంచికి రెండు కిలోల చొప్పున కోత విధించడం సరికాదన్నారు. వెంటనే అధికారులు కేంద్రం నిర్వహకులపై చర్యలు తీ సుకుని ఏలాంటి తరుగు లేకుండా సంచికి సంచి బరువు వేసి తూ కం చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈకార్యక్రమంలో ఆయన వెంట డీసీ ఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, గుల్లకోట మాజీ సర్పంచ్ గోళ్ల రవీం దర్‌తో పాటు నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 11:20 PM