ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతన్న.. జర భద్రం

ABN, Publish Date - Jun 10 , 2025 | 11:56 PM

ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలంటే... ఆది నుంచి అన్నదాత అప్రమత్తంగా ఉండాలి. దుక్కిదున్నింది మొదలు పం ట చేతికొచ్చే వరకు సాగుకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. పంటకు అవసరమయ్యే ప్రతీ వస్తువు కొ నుగోలులో... చేసే ప్రతి పనిలో అప్రమత్తంగా వ్యవహ రించాలి.

నెన్నెలలో విత్తన ప్యాకెట్లను పరిశీలిస్తున్న అధికారులు

====================

-విత్తనాలు.. ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్త

-ప్రకటనలు చూసి మోసపోవద్దు

-నకిలీలతో అప్రమత్తంగా ఉండాలని నిఫుణుల సూచన

-పంట సీజన్‌ ప్రారంభంతో కొనుగోళ్లలో రైతులు బిజీ

నెన్నెల, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలంటే... ఆది నుంచి అన్నదాత అప్రమత్తంగా ఉండాలి. దుక్కిదున్నింది మొదలు పం ట చేతికొచ్చే వరకు సాగుకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. పంటకు అవసరమయ్యే ప్రతీ వస్తువు కొ నుగోలులో... చేసే ప్రతి పనిలో అప్రమత్తంగా వ్యవహ రించాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా పంట దిగు బడి, పంట కాలం వృఽథా అయ్యే ప్రమాదంతో పాటు రైతులు అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. ము ఖ్యంగా విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల కొను గోళ్లలో అత్యంత జాగ్రత్త అవసరం. వ్యవసాయాధికా రులు, శాస్త్రవేత్తల సలహాలు సూచనలతో ముందుకు సాగాలి. విత్తన ఎంపిక నుంచి పంట దిగుబడి పొందే వరకు శాస్త్రీయంగా సేద్యపు పద్ధతులు అవలంభించ డంతో పాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటేనే అ న్నదాత పడ్డ ఆరుగాలం శ్రమకుతగ్గ ప్రతిఫలం దక్కు తుందని అధికారులు సూచిస్తున్నారు.

విత్తనాలు కొనే ముందు జాగ్రత్త...

దళారుల మాయమాటలు నమ్మి నకిలీ, లూజు వి త్తనాల జోలికి వెళ్లొద్దు. ప్రైవేటు విత్తన సంస్థలు పెద్ద ఎత్తున చేసే ప్రచారానికి ఆకర్షితులై విత్తనాలు కొను గోలు చేయవద్దు. విత్తనాన్ని ఎంచుకునే ముందు వ్యవ సాయాధికారి, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవడం మంచిది. మార్కెట్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసిన విత్తనాలు ఉంటే వాటినే తీసుకోవడం ఉత్తమం. లైసెన్సు పొందిన అధికృత డీలరు నుంచి మాత్రమే వి త్తనాలు కొనుగోలు చేయాలి. సరిగా సీల్‌ చేసి ఉన్న ప్యాకెట్లు, బస్తాలను దృవీకరణ పత్రం (ట్యాగ్‌) ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి. బస్తా, ప్యాకెట్‌పై గడువు తేది, రకం పేరు, లాట్‌ నంబర్లను గమనించాలి. కొను గోలు బిల్లుతో పాటు నంబరు, విత్తన రకం, గడువు తే ది పేర్కొనేలా డీలరు సంతకంతో కూడిన రసీదు పొం దాలి. రసీదును పంటకాలం పూర్తి అయ్య వరకు భద్ర పర్చుకోవాలి. రైతు సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి.

-ఎరువులు కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి..

పంటల అధిక దిగుబడికి రసాయన ఎరువులు దోహదం చేస్తాయి. నాన్యమైన ఎరువులనే వాడాలి. అక్కడక్కడ కొందరు దళారులు నాసీరకం ఎరువులను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఫలితంగా ఆమాయక రైతులు పెట్టుబడులు సైతం నష్టపోతు న్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మెలుకువలు పాటిస్తే న కిలీలను నివారించే ఆస్కారం ఉంది. లైసెన్సు ఉన్న దుకాణంలోనే ఎరువులను కొనాలి. కొనుగోలు చేసిన ఎరువులకు సరైన బిల్లులు పొందాలి. బిల్లును జాగ్ర త్తగా భద్రపర్చుకోవాలి. డీలర్‌ బుక్కులో రైతు విధిగా సంతకం చేయాలి. మిషన్‌ కుట్టు ఉన్న ఎరువుల బస్తా ను మాత్రమే కొనాలి. బస్తాపై ప్రామాణిక పోషకాలు, ఉత్పత్తిదారుల వివరాలు ఉండాలి. బరువులో అనుమా నం వస్తే తూకం వేయించాలి. చిరిగిన, రంద్రాలున్న బస్తాలను తిరస్కరించాలి. ఖాళి సంచులను పంటకా లం పూర్తయ్యే వరకు భద్రపర్చాలి. ఇటీవల రైతులు సూక్ష్మ పోషకాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఆందమైన ప్యాకింగులకు ఆకర్షితులు కాకుండా ఆధికారులు సిఫా రసు మేరకు కొంటే మంచిది. కొనుగోలు చేసిన ఎరువు ల విషయంలో అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. అనుమా నం ఉన్న ఎరువులను పరీక్షలకు పంపించేలా అధికా రులకు ఫిర్యాదు చేయాలి.

-పురుగు మందులపై అవగాహన అవసరం..

చీడపీడల నివారణకు వాడే క్రిమిసంహారక మందు ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యం గా వ్యవసాయశాఖ సూచించే మందులను కొనాలి. ని షేదిత మందుల జోలికి వెళ్లొద్దు. లైసెన్సు లేని దుకా ణాల నుంచి కొనవద్దు. అవసరానికి మించి కొని నిల్వ చేసుకుంటే మందులు చెడిపోతాయి. లేబుల్‌ లేని మందుసీసా, ప్యాకెట్‌, డబ్బాలను కొనరాదు. లేబుల్‌ మీద ప్రకటించిన మందు పేరు, రూపం, మందు శా తం, పరిమాణం, విష ప్రభావం, తెలిపే గుర్తులు, వా డకంలో సూచనలు, జాగ్రత్తలు, విరుగుడు మందులు, బ్యాచ్‌ నంబరు, వాడాల్సిన గడువు, తయారు చేసిన సంస్థ పేరు, రిజిస్ట్రేషన్‌ విషయాలు పరిశీలించాలి. మందుల విషపూరిత స్థాయిని తెలిపేం దుకు డైమాండ్‌ ఆకారంలో తెలుపుతో మరో రంగు వినియోగిస్తారు. వాటి వర్గీకరణను బట్టి విషస్థాయిని అంచనా వేసుకోవచ్చు. ఎరుపు రంగు ఉం టే అత్యంత విషపూరితం. పసుపు రంగు అతి విషపూరితం. నీలి రంగు వి షపూరితం, ఆకు పచ్చ రంగు స్వల్ప విషపూరితం అని అర్థం చేసుకో వాలి.

రైతులకు ముందు జాగ్రత్త అవసరం

డాక్టర్‌ కోట శివకృష్ణ,

కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, బెల్లంపల్లి

విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్ల సమయంలో రైతులకు ముందు జాగ్రత్త అవసరం. త క్కువ ధరకు వస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లో లూజు విత్తనాలు కొనకూడదు. మద్య దళారుల మాయమాట లు నమ్మి మోసపోవద్దు. కొనుగోలు చేసిన విత్తన ప్యాకె ట్‌పై వివరాలను సరి చూసుకోవాలి. తయారీ తేది, లాట్‌ నంబరు, ఎక్స్‌పైరీ డేటులను చూసి వాటిని రసీదుపై రా యించుకోవాలి. విత్తనాల ఖాళి ప్యాకెట్లు, సంచులు, రసీదులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచి ఉంచాలి. సరిగ్గ మొలవక పోవడం, దిగు బడి రాకపోవడం లాంటి సమస్యలు వస్తే కంపెనీ నుంచి పరిహారం పొంద వచ్చు. నిఫుణుల సూచన మేరకు తగిన మోతాదులోనే పిచికారి చేయాలి. రైతుల ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా వివిధ అంశాలపై రైతు లకు అవగాహన కల్పిస్తున్నాం.

Updated Date - Jun 10 , 2025 | 11:56 PM