ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- ఉప్పొంగిన ప్రాణహిత

ABN, Publish Date - Jul 10 , 2025 | 11:26 PM

మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. మండల సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత నది ఉప్పొంగడంతో తీర ప్రాంతాల్లోని రైతులు సాగు చేసిన పత్తి పంట వందలాది ఎకరాల్లో నీట మునిగింది. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు అక్కడే ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వేయడంతో ప్రాణహిత నదికి వరద నీరు భారీగా పోటెత్తింది.

బెజ్జూరులో నీట మునిగిన తలాయి- సోమిని బ్రిడ్జి

- వందలాది ఎకరాల్లో నీట మునిగిన పత్తి పంట

- లో లెవల్‌ వంతెనపై పారుతున్న వరద నీరు

బెజ్జూరు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. మండల సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత నది ఉప్పొంగడంతో తీర ప్రాంతాల్లోని రైతులు సాగు చేసిన పత్తి పంట వందలాది ఎకరాల్లో నీట మునిగింది. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు అక్కడే ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వేయడంతో ప్రాణహిత నదికి వరద నీరు భారీగా పోటెత్తింది. దీంతో ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌ పంట ఏలలో చేరడంతో రైతులు సాగు చేసిన పత్తి పంట నీట మునిగింది. వరద ఉధృతికి తలాయి, పాత సోమిని గ్రామాల మధ్య వంతెన నీట మునగడంతో రాక పోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తలాయి- పాపన్నపేట గ్రామాల మధ్య ప్రధాన రోడ్డుపై ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌ పారుతుండడంతో రాక పోకలకు ఆటంకం ఏర్పడింది. కుశ్నపల్లి, సోమిని గ్రామాల మధ్య లోలెవల్‌ వంతెన పై నుంచి భారీగా వరద నీరు పారు తుండడంతో రాకపోకలు స్తంభించి పోయాయి. దీంతో వాగు అవతలి వైపు ఉన్నసుస్మీర్‌, సోమిని, మొగవెల్లి, ఇప్పలగూడ, పాత సోమిని, గర్రెగూడ, నాగేపల్లి, తలాయి, తిక్కపల్లి, భీమారం మొత్తం 11 గ్రామాలు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రాణహిత తీర ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన పత్తి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలోనే పత్తి పంట నీట మునిగి వేలాది రూపాయలు నష్ట పోయామని రైతులు ఆవేధన చెందుతున్నారు. కాగా పాపన్నపేట, తలాయి తీర ప్రాంతాల్లో నీట మునిగిన పంటలను వ్యవసాయాధికారి నాగరాజు పరిశీలించారు. ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌ కారణంగా సుమారు పదిహేను వందల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత పుష్కరఘాట్‌ పూర్తిగా మునిగి పోయింది. ఎగువ మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ప్రాణహితలో నీటిమట్టం పెరిగింది. బుదవారం సగం పుష్కరఘాట్‌ మెట్లు మునిగి పోగా గురువారం నాటికి పూర్తిగా పుష్కరఘాట్‌ మెట్లు మునిగి పోయాయి. దీంతో సందర్శకులు ప్రాణహిత పుష్కరఘాట్‌ సందర్శిస్తున్నారు. కాగా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లకూడదని పోలీసు, రెవెన్యూ శాఖ హెచ్చరిస్తున్నారు.

చింతలమానేపల్లి, ఆంధ్రజ్యోతి): చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు రావడంతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. వంతెనను తాకే విదంగా వరద నీరు రావడం ఈ ఏడాది మొదటి సారి. నది ప్రవాహం పెరుగుతుండడంతో నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రత్తంగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ శాఖల అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. వరద ప్రవాహం పెరగడంతో ప్రాణహితకు సందర్శకుల తాకిడి పెరిగింది.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూర్‌(టి) మండలంలోని వెంకట్రాపూట, పోడ్సా వంతెనను ఆనుకుని పెన్‌గంగా నది ప్రవహిస్తుంది. నది పరివాహక ప్రాంతాలైన హుడ్కిలి, మాకిడి, జక్కాపూర్‌, లోనవెల్లి, వెంకట్రాపేట, లక్ష్మిపూర్‌ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా చేపల వేటకు వెళ్లరాదని తహసీల్దార్‌ రహీముద్దీన్‌, ఎంపీడీఓ సత్యనారాయణ, ఎస్సై కమలాకర్‌లు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మండలంలోని కేశవపట్నం, భూపాలపట్నం, హుడ్కిలి, ఇటిక్యాలపహాడ్‌, మాలిని తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన దారుల్లో వాగులు ఉప్పొంగి పోర్లుతుండడంతో ప్రజలు ఎవరు కూడా దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండలంలోని మొట్లగూడ, రాంపూర్‌, రావులపల్లి, దిగిడ గ్రామాల్లో పంటలు వంలాఇ ఎకరాల్లో నీట మునిగాయి. బ్యాక్‌వాటర్‌ కారణంగా బ్యాక్‌వాటర్‌ పంట చేనులో నిలిచి పంటలు నష్ట పోతామని రైతులు ఆవేదన చెందుతు న్నారు. అదే విధంగా కుమరం భీం ప్రాజెక్టు గేటు ఎత్తి నీటిని కిందికి వదలడంతో పెద్దవాగులోకి ఉధృతంగా ప్రవహిసోంది.

పెంచికలపేట,(ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో బొక్కివాగు, ఉచ్చమల్లవాగు, గొల్లగూడ వాగులు పొంగి పారుతున్నాయి. కొండపల్లి- గొల్లగూడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కొట్టుకు పోయింది. మరో వైపు ప్రాణహిత నది ఉప్పొగడంతో తీర ప్రాంత గ్రామాలైన జిల్లెడ, మురళీగూడ, కమ్మర్‌గాం, నందిగాం గ్రామాల్లో సాగు చేసిన పత్తి పంట వందల ఎకరాల్లో నీట మునిగాయి.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కాగజ్‌నగర్‌ పట్టణం సమీపంలోని పెద్దవాగుకు వరద ఉధృతి పెరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

కోటపల్లి, (ఆంధ్రజ్యోతి) : మండలానికి ఆనుకుని ప్రవహిస్తున్న ప్రాణహిత నది ప్రవాహం ఉధృతంగా ఉన్నందున నది పరివాహకప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ రాఘవేంద్రరావు , ఎస్‌ఐ రాజేందర్‌లు సూచించారు. మండలంలోని అన్నారం, అర్జునగుట్ట నది పరివాహక ప్రాంతాల్లోని వరద ప్రవాహాన్ని పరిశీలించడంతో పాటు అంతర్‌రాష్ట్ర వంతెన వద్ద నది ప్రవాహ ఉధృతిని పరిశీలించారు. నది పరివాహక గ్రామాలైన వెంచపల్లి, సూపాక, ఆల్గామ, పుల్లగామ, జనగాం, సిర్సా, అన్నారం, రాపనపల్లి, అర్జునగుట్ట గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గిర్దావర్‌ శ్రీనివాస్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వేమనపల్లి, (ఆంధ్రజ్యోతి) : మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో వేమనపల్లి సరిహద్దు న ప్రవహిస్తున్న ప్రాణహిత నది గురువారం ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని కల్లెంపల్లి, సుంపుటం, జాజులపేట, వేమనపల్లి, కేతనపల్లి, ముల్కలపేట తదితర గ్రామాల శివారులోని వందలాది ఎకరాల్లో పత్తి పంట నది బ్యాక్‌ వాటర్‌తో నీట మునిగింది. వేమనపల్లి నుంచి సుంపుటంకు వెళ్లే రెడ్డుపైకి బ్యాక్‌ వాటర్‌ చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముల్కలపేట నుంచి రాచర్లకు వెళ్లే మార్గంలో బొందచేను ఒర్రె వద్ద నది బ్యాక్‌ వాటర్‌ రావడంతో ఈ దారిలో కూడా అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చేపలు పట్టేవారు నదిలోకి వెళ్లవద్దని తహసీల్దార్‌ సంధ్యారాణి, ఎస్‌ఐ శ్యామ్‌పటేల్‌లు హెచ్చరించారు. వేమనపల్లి నుంచి మహారాష్ట్రకు నాటు పడవల ద్వారా వెళ్లవద్దని అధికారులు సూచించారు.

నిలిచిన రాకపోకలు

చింతలమానేపల్లి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): మండలంలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి దిందా- కేతిని గ్రామాల మధ్య ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాక పోకలు నిలిచి పోయాయి. ఏటా వర్షాకాలం ఇదే పరిస్థితి దాపురిస్తోంది. లో లెవల్‌ వంతెన హైలెవల్‌ వంతెన నిర్మాణం చేపట్టాలని తాము ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా వాగులో నుంచి ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Jul 10 , 2025 | 11:26 PM