శాంతిభద్రతల కోసం అందరూ సమన్వయంతో పని చేయాలి
ABN, Publish Date - Jul 25 , 2025 | 12:14 AM
శాంతిభద్రతల కోసం నే రాల నియంత్రణ కోసం పోలీసు అధికారులు సిబ్బంది సమన్వయం తో పని చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సమావేశంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌కు సంబంధించిన అ ధికారులు పాల్గొన్నారు.
రామగుండం సీపీ అంబర్ కిషోర్‌ఝా
మంచిర్యాలక్రైం, జూలై24 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల కోసం నే రాల నియంత్రణ కోసం పోలీసు అధికారులు సిబ్బంది సమన్వయం తో పని చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సమావేశంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌కు సంబంధించిన అ ధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జోన్‌లవారిగా పెండింగ్ కేసు లకు సంబంధించి నేరస్తుల అరెస్టు, దర్యాప్తు, సాక్షాధారాల సేకరణ, చార్జీ షీటు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై ఆయన అధికా రులను అడిగి తెలుసుకున్నారు. కమిషనరేట్ పరిధిలో గ్రేవ్ కేసులు మహిళ లపై నేరాలు ఆస్తి నేరాలు, ఫోక్పో కేసులు, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించిన సమాచారంతో పాటు గత ఆరు నెలల కాలంలో జరిగిన తప్పిదాలు భవిష్యత్‌లో కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అధికారులకు సూచించారు. సైబర్ క్రైంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, నే రాల నివారణకు దర్యాప్తు నిర్వహించాలని పోలీసు స్టేషన్ పరిదిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్కు చేస్తే నేరాల నియంత్రణ, ప్రజలతో మంచి సంబంధాలు పెరుగుతాయన్నారు. నేరాల నియంత్రణ కోసం పెట్రో లింగ్ నియంత్రణకు పెట్రోలింగ్ ముమ్మరంగా చేయాలన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, మల్లా రెడ్డి, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 12:14 AM