ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ABN, Publish Date - Apr 16 , 2025 | 11:32 PM
నిరంతరం విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ తీసుకొని జాగ్రత్తలు వహించాలని రామగుండం పోలీసు క మిషనర్ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు.
సీపీ అంబర్‌కిషోర్‌ఝా
మంచిర్యాలక్రైం, ఏప్రిల్16 (ఆంధ్రజ్యోతి): నిరంతరం విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ తీసుకొని జాగ్రత్తలు వహించాలని రామగుండం పోలీసు క మిషనర్ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. రామగుండం పోలీసు కమి షనరేట్ పరిధిలో సిబ్బందికి మెగా హెల్త్‌క్యాంప్ కార్యక్రమాన్ని చే పట్టారు. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు శ్రీకాంత్, డాక్టర్ సునిల్ సిబ్బంది పాల్గొన్నారు. వైద్యులు సిబ్బందికి అన్ని పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా అత్యవసర సమయంలో సీపీఆర్ చేసే విధానాన్ని సిబ్బందికి ఎలా చేయాలో సూచించారు. ఈ సం దర్భంగా సీపీ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే సిబ్బంది ఒత్తిళ్లకు లోనుకాకుండా ఉండాలని వ్యాయామం, యోగా వంటివి చేయాలన్నారు. ఆహారపు అలవాట్లలో మార్పు అవసరం అన్నా రు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత మెరు గైన సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 16 , 2025 | 11:33 PM