ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతీ ఒక్కరు ఆధార్‌కార్డు కలిగి ఉండాలి

ABN, Publish Date - Jun 13 , 2025 | 11:27 PM

జిల్లా లో పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఆధార్‌కార్డు కలిగి ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో యుఐడీ అసిస్టెంట్‌ మేనేజర్‌ మ హ్మద్‌ శౌబన్‌, ప్రత్యేక ఉప పాలన అధికారి చంద్రకళ, ఏసీ పీ ప్రకాష్‌తో కలిసి సమావేశం నిర్వహించారు.

క్రీడాకారులను అభినందిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లా లో పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఆధార్‌కార్డు కలిగి ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో యుఐడీ అసిస్టెంట్‌ మేనేజర్‌ మ హ్మద్‌ శౌబన్‌, ప్రత్యేక ఉప పాలన అధికారి చంద్రకళ, ఏసీ పీ ప్రకాష్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధార్‌ కార్డు కలిగి ఉండేలా అధి కారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆధార్‌ కార్డు నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు.. కార్యక్రమం లో డీపీవో వెంకటేశ్వర్‌రావు, డీఈవో యాదయ్య, లీడ్‌ డిస్టిక్‌ మేఏజర్‌ తిరుపతి, సునీల్‌ పాల్గొన్నారు.

-ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

జిల్లాలోని నిరక్షరాస్యులైన ప్రతి ఒక్కర్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం స మీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లాలో 15 ఏళ్లు పైబడిన లక్షా 20 వేల మంది నిర క్షరాస్యులను గుర్తించామని, మొదటి విడతలో భాగంగా 30, 600 మందిని అక్షరాస్యులుగా మార్చేందుకు ఎంపిక చేశా మన్నారు. కాసిపేట మండలాన్ని ఎంపికచేసి వంద శాతం అక్షరాస్యత మండలంగా మార్చామన్నారు. జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్‌, డీఆర్‌డీవో కిషన్‌ పాల్గొన్నారు.

క్రీడాకారులను అభినందించిన కలెక్టర్‌

ఇటీవల గోవాలో జరిగిన జాతీయ స్ధాయి బాక్సింగ్‌ పోటీ ల్లో ప్రతిభ కనబర్చిన జిల్లా ఖేలో ఇండియా బాక్సింగ్‌ క్రీడా కారులను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ శుక్రవారం కార్యాలయంలో అభినందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ స్ధాయి బా క్సింగ్‌ జూనియర్‌ విభాగంలో 48 నుంచి 50 కిలోల విభా గంలో ఉబైద్‌ఖాన్‌, 50 నుంచి 52 కిలోల విభాగంలో క్రితి అగర్వాల్‌లు వెండి పతకాలు సాధించడం అభినందనీయ మన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా సేవల శాఖ అధికారి హన్మంత్‌రెడ్డి, బాక్సింగ్‌ శిక్షకుడు రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 11:27 PM