ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతీ గ్రామంలో మున్నూరు కాపు సంఘాల ఏర్పాటు

ABN, Publish Date - May 15 , 2025 | 10:47 PM

గ్రామ గ్రామాన మున్నూరు కాపు సంఘా లను ఏర్పాటు చేస్తూ, ఓకే సంఘంగా ఐక్యతను చాటుదామని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోరిగాం రాజా రాం అన్నారు. నస్పూర్‌ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు.

మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు దేవయ్య

మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య

నస్పూర్‌, మే 15 (ఆంధ్రజ్యోతి) : గ్రామ గ్రామాన మున్నూరు కాపు సంఘా లను ఏర్పాటు చేస్తూ, ఓకే సంఘంగా ఐక్యతను చాటుదామని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోరిగాం రాజా రాం అన్నారు. నస్పూర్‌ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక జనాభతో కూడిన మున్నూ రు కాపులను ప్రభుత్వం తక్కువ సంఖ్యలో చూపిస్తుందని ఆరోపించారు. రాష్ట్రం లో 12వేల గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంఘంలో సభ్యులుగా ఉన్నవారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్‌ ద్వారా కమిటీలను ఎన్నుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణను చే పట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ క్యాబినేట్‌లో మున్నూరు కాపులకు మం త్రి పదవి ఇవ్వాలని కోరారు. జనాభ ప్రాతిపదిన తమకు వాటా అన్ని రంగాల్లో కల్పించాలన్నారు. ఆగస్టు 30, 31వ తేదీన అమెరికాలో మహాసభను నిర్వహిస్తు న్నామన్నారు. ప్రతి ఒక్కరు కుల సంఘంలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం అమెరికాలో నిర్వహించే మున్నూరు కాపు మహాసభ పోస్టర్లను ఆవి ష్కరించారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం నియోజకవర్గ అధ్యక్షు లు పల్లె భూమేశ్‌, జిల్లా గౌరవ అధ్యక్షులు గొంగల్ల శంకర్‌, కన్వీనర్‌ ఆకుల సత్త య్య, జిల్లా అధికార ప్రతినిధి రాజేశం, నస్పూర్‌ మండల కమన్వయ కమిటీ సభ్యులు మైదం రామక్రిష్ణ, రాళ్లబండి రాజన్న పూదరి కుమార్‌, నాయకులు బోరి గాం వెంకటేశ్‌, బొడ్డు చిన్నయ్య, కర్నే శ్రీనివాస్‌, విశాల్‌, మల్లేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 10:47 PM