నైపుణ్య శిక్షణతోనే ఉపాధి అవకాశాలు
ABN, Publish Date - Apr 28 , 2025 | 11:10 PM
నైపుణ్య శిక్షణ తోనే ఉపాధి అవకాశాలు ఉంటాయని కలెక్టర్ కుమార్ దీపక్ అ న్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో టాస్క్ ద్వారా నిర్వహి స్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభిం చి మాట్లాడారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : నైపుణ్య శిక్షణ తోనే ఉపాధి అవకాశాలు ఉంటాయని కలెక్టర్ కుమార్ దీపక్ అ న్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో టాస్క్ ద్వారా నిర్వహి స్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభిం చి మాట్లాడారు. 30 రోజుల పాటు అర్హత గల యువతకు పరిశ్ర మ సంబంధిత నైపుణ్యం అందిస్తామన్నారు. శిక్షణ మొదటి విడత లో 40 మంది నిరుద్యోగ యువత ఎంపికయ్యారన్నారు. శిక్షణలో సీ, సీప్లస్‌ప్లస్, జావా, పైథాన్, అప్టిట్యూడ్ రీజనింగ్, ఇంటర్య్వూ నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుందన్నారు. శిక్షణ అనంత రం నైపుణ్యత గల వారికి ఉద్యోగావకాశాలు అందించబడ తాయ న్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్ సీవో శ్రీకాంత్‌స్నేహ, స్టేట్ కో ఆర్డినేటర్ నవీన్‌రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రవికృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Apr 28 , 2025 | 11:10 PM