ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్లాస్టిక్‌ నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత

ABN, Publish Date - Jul 06 , 2025 | 12:09 AM

: ప్లాస్టిక్‌ నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత అని గ్రీన్‌క్లబ్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్‌, సలహాదారుడు శశిధర్‌, సుధాకర్‌ పీవీసీ అధినేత మీలా మహదేవ్‌ అన్నారు.

విద్యార్థులకు క్లాత్‌సంచులను అందజేస్తున్న మీలా మహదేవ్‌, ముప్పారపు నరేందర్‌, శశిధర్‌

సూర్యాపేటఅర్బన్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌ నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత అని గ్రీన్‌క్లబ్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్‌, సలహాదారుడు శశిధర్‌, సుధాకర్‌ పీవీసీ అధినేత మీలా మహదేవ్‌ అన్నారు. సింగిల్‌యూజ్‌ కవర్లతో జరిగే అనర్థాలపై శనివారం జిల్లాకేంద్రంలోని మారుతి విద్యానికేతన్‌ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. భవిష్యత్‌ తరాలు సురక్షితంగా జీవించాలంటే ప్లాస్టిక్‌ కవర్లను పూర్తిగా తిరస్కరించాలన్నారు. ప్రకృతిని గౌరవిస్తూ కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు క్లాత్‌ సంచులు అందజేశారు. కార్యక్రమంలో తోట కిరణ్‌, ఉప్పల శ్రవణ్‌, కక్కిరేణి చంద్రశేఖర్‌, ఉపేంద్రాచారి, రమేష్‌, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సురేష్‌, సంపత్‌,నాగేశ్వర్‌రావు, హేమమాలిని, సువర్ణలక్ష్మి, విజయలక్ష్మి, అలేఖ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:09 AM