కరెంటు బిల్లులు విడుదల చేయాలి
ABN, Publish Date - May 11 , 2025 | 11:15 PM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులకు పెండింగ్‌లో ఉన్న ఉచిత కరెం టు బిల్లులను వెంటనే విడుదల చేయాలని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక డిమాండ్ చేశారు.
- రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక
నాగర్‌కర్నూల్ టౌన్, మే 11 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులకు పెండింగ్‌లో ఉన్న ఉచిత కరెం టు బిల్లులను వెంటనే విడుదల చేయాలని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని రజక సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రజక వృత్తిదా రులకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్ష లు ఇచ్చి వృత్తిని ప్రోత్సహించడంతో పాటు ని రుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందు బాలస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, ఉపాధ్య క్షుడు బాలకృష్ణ, కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి రాములు, సైదులు పాల్గొన్నారు.
Updated Date - May 11 , 2025 | 11:15 PM