విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - May 14 , 2025 | 12:12 AM
నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు రూ.34 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు.
టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీని కలిసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
రూ.34 కోట్లు విడుదల చేయాలని వినతి
చౌటుప్పల్ టౌన్, మునుగోడు రూరల్, మే 13 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు రూ.34 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నాయ కులతో హైదరాబాద్‌లోని టీజీ ఎస్పీడీసీఎల్ రాష్ట్ర కార్యాలయంలో సీఎండీ ముషారఫ్‌ను కలిశారు. నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వివరించారు. మునిసిపాలిటీలు, గ్రామాల్లో నెలకొన్న లో-ఓల్టేజీ సమస్య, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించాలని కోరారు. లూజ్ లైన్లు, నివాస గృహాలు, ప్రభుత్వ కార్యా లయాలపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను తొలగించి ప్రమాదాలను నివారించాలని కోరారు. వెనుకబడిన మునుగోడును పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకొని అన్ని రకాల విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని, వ్యవసాయాధిరిత ప్రాంతమైనందున రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన్నారు. విద్యుత్ శాఖలో విధుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అవినీతికి పాల్పడుతున్నారని, ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు, ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంఘటనలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు.
సీఎండీ దృష్టికి సమస్యలు
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తమ దృష్టికి తెచ్చిన విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎండీ ముషారఫ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ పొలాల మధ్య ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే మార్చాలన్నారు. అగ్రికల్చర్ డీపీఆర్‌లకు ఏబీ స్విచ్‌లు పెంచుతామని, మే, జూన్ మాసాల్లో ఏబీ స్విచ్‌లను మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, చౌటుప్పల్ మాజీ ఎంపీపీ చిల్కూరీ ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ మునుగోడు ఇన్‌చార్జి పబ్బు రాజు, మునిసిపల్ మాజీ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నర్సింహ, బోయ దేవేందర్ పాల్గొన్నారు.
Updated Date - May 14 , 2025 | 12:12 AM