Hyderabad: గుడ్డు, చికెన్‌లో పుష్కలంగా పోషకాలు..
ABN, Publish Date - Feb 27 , 2025 | 10:05 AM
ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందుతాయని పలువురు అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఇండియన్ పౌల్ర్టీ ఎకిప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్(Indian Poultry Equipment Manufacturers Association in Jubilee Hills) ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ప్రొటీన్ దినోత్సవాన్ని నిర్వహించారు.
హైదరాబాద్: ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందుతాయని పలువురు అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఇండియన్ పౌల్ర్టీ ఎకిప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్(Indian Poultry Equipment Manufacturers Association in Jubilee Hills) ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ప్రొటీన్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ బిగాస్ మాట్లాడుతూ.. కడుపు నింపుకుంటే శక్తి దానంతట అదే వస్తుందనే భ్రమలో చాలా మంది కార్బొహైడ్రేట్స్ తీసుకుంటున్నారని, ఈ ఆలోచన సరికాదన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Vikarabad: అనంతగిరికి అందాల భామలు..
శరీరానికి కావాల్సిన పోషక విలువలు గుడ్డు, చికెన్(Egg, chicken)లో పుష్కలంగా ఉన్నాయన్నారు. కణజాలాలను నిర్మించడానికి, మరమ్మతులు చేయడానికి, ఎంజైమ్‌లు, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ కోసం ప్రొటీన్ చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పోషకాహార నిపుణులు పూజా మఖిజా తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?
ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ
ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!
Read Latest Telangana News and National News
Updated Date - Feb 27 , 2025 | 10:05 AM