అర్హులందరికీ నష్టపరిహారం అందించేందుకు కృషి
ABN, Publish Date - May 04 , 2025 | 11:26 PM
అకాల వర్షంతో నష్టపోయిన రైతుల కన్నీళ్లు తుడవడమే తమ ధ్యేయమని, నష్టపోయిన రైతులకు నష్టపరిహా రం అందించేందుకు కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకట స్వా మి పేర్కొన్నారు.
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి
భీమారం, మే 4 (ఆంధ్రజ్యోతి) : అకాల వర్షంతో నష్టపోయిన రైతుల కన్నీళ్లు తుడవడమే తమ ధ్యేయమని, నష్టపోయిన రైతులకు నష్టపరిహా రం అందించేందుకు కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకట స్వా మి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పోతనపల్లి, బూరుగుపల్లి, న ర్సింగాపూర్, కాజీపల్లి గ్రామాల్లో వడగండ్ల వానకు నష్టపోయిన వరి పం టలను, మామిడితోటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టపోయిన పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పండిం చుకున్న పంటలు నేలమట్టమయ్యాయని మహిళా రైతులు ఆవేదన వ్య క్తం చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తా నని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అర్హులందరికీ న్యాయం చేస్తానన్నారు. వడగండ్ల వానకు ఇండ్లు కోల్పోయిన వారి జాబితా సరిగ్గా లేదని సంబంధి త అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇండ్లు కోల్పోయిన, దెబ్బతిన్న పంటలపై మరోసారి సర్వే చేయాలని అధికారులకు సూచించారు. రైతు లకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అడిషనల్ డైరెక్టర్ ప్రసాద్, తహసీల్దార్ సదానందం, ఎంపీవో సతీష్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణరెడ్డి, రవి, శ్రీనివాస్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - May 04 , 2025 | 11:26 PM