ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి : వీరేశం

ABN, Publish Date - Apr 17 , 2025 | 12:14 AM

నకిరేకల్‌ మునిసిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృ షి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి : వీరేశం

నకిరేకల్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): నకిరేకల్‌ మునిసిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృ షి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. పట్టణంలోని 4వ వార్డులో నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీ నిర్మాణ పనుల కు బుధవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నకిరేకల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. మునిసిపా లిటీ పరిధిలోని సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలు సుకున్నారు. పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం షార్ట్‌సర్క్యూట్‌తో ఇళ్లు దగ్ధమైన పజ్జూ రు కృష్ణ కుటుంబాన్ని ఎమ్మెల్యే వీరేశం పరామర్శించారు. ఇంట్లో సామగ్రి మొత్తం దగ్ధమైందని వాపోయాడు. స్పందించిన ఎ మ్మెల్యే బాధితులకు దుస్తువులు, ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ యా కార్యక్రమాల్లో నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన చెవుగోని రజిత శ్రీనివాస్‌, కమిషనర్‌ బాలయ్య, మునిసిపల్‌ కౌన్సిలర్లు గాజుల సుకన్య శ్రీనివాస్‌, ఘర్షకోటి సైదులు, రాచకొండ సునిల్‌, గడ్డం స్వామి, నాయకులు లింగాల వెంకన్న, వెంకన్న, రాజు, రవి, యాదగిరిరెడ్డి, రాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:14 AM