ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మంచిర్యాల రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి కృషి

ABN, Publish Date - Jul 07 , 2025 | 11:32 PM

మంచిర్యాల రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి కృషి చేస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం సందీప్‌ మాథుర్‌ పేర్కొ న్నారు. అమృత్‌ భారత్‌ పథకం ద్వారా 26.9 కోట్ల రూపాయలతో మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో జరుగు తున్న అభివృద్ధి పనులు సోమవారం రైల్వే అధికా రులతో కలిసి పర్యవేక్షించారు.

దక్షిణమధ్య రైల్వే జీఎం సందీప్‌ మాథుర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి కృషి చేస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం సందీప్‌ మాథుర్‌ పేర్కొ న్నారు. అమృత్‌ భారత్‌ పథకం ద్వారా 26.9 కోట్ల రూపాయలతో మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో జరుగు తున్న అభివృద్ధి పనులు సోమవారం రైల్వే అధికా రులతో కలిసి పర్యవేక్షించారు. ఆయన మాట్లాడు తూ అన్ని హంగులతో రైల్వేస్టేషన్‌ కొత్త రూపు సం తరించుకుంటుందన్నారు. ప్రయాణికులకు ఆధునిక ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా అ త్యాధునిక సౌకర్యాలతో పాటు మెరుగైన సేవలందిం చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్‌ భారత్‌ పథకం ప్రజల పాలిట వ రమన్నారు. మరికొన్ని రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తై ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నా రు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ రైల్వే మేనేజర్‌భరత్‌ కుమార్‌ జైన్‌, మంచిర్యాల రైల్వే మేనేజర్‌ ముత్తినేని రవీందర్‌, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

వందే భారత్‌ రైలును ఆపాలని వినతి

మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌ రైలును నిలపాలని కోరుతూ సోమవారం మంచిర్యాల రైల్వే స్టేషన్‌కు వచ్చిన దక్షిణమధ్య రైల్వే జీఎం సందీప్‌ మాథుర్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంక టేశ్వర్‌గౌడ్‌ వినతి పత్రం అందించారు. మంచిర్యాల రైల్వేస్టేషన్‌ రెవెన్యూ పరంగా అతి పెద్దదని, మ ం చిర్యాల రైల్వేస్టేషన్‌లో పలు సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె స్‌ రైళ్లతో పాటు వందేభారత్‌ రైలును నిలుపుదల చేయాలని కోరారు. మంచిర్యాల నుంచి తిరుపతికి వెళ్లేందుకు ప్రతి రోజు రైళ్లను నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు అమిరి శెట్టి రాజ్‌కుమార్‌, ముల్కల మల్లారెడ్డి పాల్గొన్నారు.

మూడో రైల్వే లైన్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

బెల్లంపల్లి: 3వలైన్‌ ట్రాక్‌ నిర్మాణ పనులను త్వ రిగతిన పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్‌ మఽథుర్‌ అన్నారు. సోమవారం బెల్లంపల్లి రై ల్వే స్టేషన్‌ పరిశీలించారు. రైల్వే స్టేషన్‌తో పాటు ఆ వరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీ లించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ 3వ రైల్వేలైన్‌ ట్రాక్‌ నిర్మాణ పనుల విషయంలో అ ధికారులందరూ సమిష్టిగా పనులు చేపట్టి త్వరిత గిన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. బెల్లం పల్లికి వచ్చిన రైల్వే జీఎంకు సీపీఐ నాయకులు వి నతిపత్రం అందజేశారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో నవజీవన్‌, గ్రాండ్‌ ట్రాక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపే వి ధంగా చూడాలని జీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే బెల్లంపల్లిలోని రాంనగర్‌ అండర్‌ బ్రిడ్జీనీ ప్రారంభిం చి ప్రజలకు, వాహనదారులకు రాకపోకల అనుమ తిని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీ నియర్‌ నాయకులు చిప్ప నర్సయ్య, పట్టణ కార్యద ర్శి రాజమౌళి, నాయకులు తిలక్‌, రత్నం రాజ్యం, పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 11:32 PM