ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎంబీ చర్చిలో ఈస్టర్‌ పండుగ

ABN, Publish Date - Apr 20 , 2025 | 11:12 PM

జిల్లా కేంద్రంలోని ఎంబీ చర్చి లో క్రైస్తవులు ఈస్టర్‌ పం డుగను ఘనంగా నిర్వ హించుకున్నారు.

సందేశం వినిపిస్తున్న ముఖ్య ప్రసంగీకులు బాలు భాగ్యరావుల

కందనూలు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని ఎంబీ చర్చి లో క్రైస్తవులు ఈస్టర్‌ పం డుగను ఘనంగా నిర్వ హించుకున్నారు. ఆదివా రం ఉదయం 5గంటలకు చర్చి సమీపంలోని సిలు వ వద్దకు వెళ్లి ప్రభువై న ఏసుక్రీస్తు పునరుద్థా నం గురించి పాస్టర్‌ వీఎస్‌ భాస్కర్‌ క్రైస్తవులకు వివరించారు. అనంతరం బాప్తిజం కార్యక్రమం నిర్వహించుకున్నారు. చర్చి ఆరాధన కార్యక్రమంలో భాగంగా పాటల ద్వారా దేవుని మహిమను వివరించారు. ఈస్టర్‌ పండుగ సందర్భంగా ముఖ్య ప్రసంగీకులుగా విశ్వవాణిలో పని చేస్తున్న బాలు భాగ్యరావు పాల్గొని తన సందేశం అందజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ లేఖనాలలో రాయ బడ్డ ప్రకారం ప్రభువైనక ఏసుక్రీస్తు వారు శుభశుక్రవారం రోజు సిలువపై మృతి నుంచి తిగిరి మూడవ రోజున మరణాన్ని జయించి తి రిగి లేచాడని అన్నారు. అనంతరం గత రెండు నెలల నుండి బైబిల్‌లోని కొన్ని అధ్యాయాలను చదివి ప్రతివారం కండక్ట్‌ చేస్తున్న బైబిల్‌ క్విజ్‌ విజేతలకు బీఈ సంగీత రాణి బహుమతి ప్ర దానం చేశారు. అనంతరం ప్రేమ విందుతో కా ర్యక్రమాన్ని ముగించుకున్నారు. ఈ కార్యక్రమం లో ఎంబీ చర్చి చైర్మన్‌ పి.సంపత్‌ కుమార్‌, కమిటీ సభ్యులు, సంఘపెద్దలు, మహిళలు, యవ్వనస్తులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో ఈస్టర్‌ వేడుకలు

కల్వకుర్తి : కల్వకుర్తి పట్టణంలో ఈస్టర్‌ వే డుకలను ఆదివారం క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థన జరి పారు. గుడ్‌ ఫ్రైడే రోజు సిల్వర్‌ త్యాగమర ణం పొందిన మహోన్నతుడైన ఏసుక్రీస్తు మూడవ రోజు ఆదివారంక సజీవుడై లేచిన రోజే ఈస్టర్‌ పర్వదినం అని ఎంబీవార్కంటిన్‌ మెమోరియల్‌ చర్చి రెవరెండ్‌ జేబీ.రాజు అన్నారు. కార్యక్ర మంలో చర్చి చైర్మన్‌ జోహన్న విల్సన్‌, వైస్‌ చైర్మన్‌ స్టీవెన్‌సన్‌, సెక్రటరీ రామస్వామి, జా యింట్‌ సెక్రటరీ జగదీశ్‌, ఇజ్రాయిల్‌, సురేష్‌ బాబు, జ్యోతి పాస్టర్‌ అమ్మ, యూత్‌ సభ్యులు నేరటి రవి, జ్యోతి ప్రసాద్‌, నందు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:12 PM