kumaram bheem asifabad- డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ సులువు
ABN, Publish Date - Jul 19 , 2025 | 11:29 PM
కొత్త వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు పొందాలంటే ఇప్పటి వరకు ఓ సుదీర్ఘ ప్రక్రియ. రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరిగితే కానీ పని పూర్తికాని పరిస్థితి. ప్రస్తుతం అలాంటి బాధలు లేకుండా ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్‌లో తీసుకునే అవకాశం రవాణాశాఖ కల్పిస్తోంది. ద్విచక్రవాహనం, కారు, ఏ వాహనం నడపా లన్నా ఆ వాహన ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పొల్యుషన్ పత్రం తో పాటు ప్రధానమైనది డ్రైవింగ్ లైసెన్స్. వాహనం నడపాలటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
వాంకిడి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కొత్త వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు పొందాలంటే ఇప్పటి వరకు ఓ సుదీర్ఘ ప్రక్రియ. రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరిగితే కానీ పని పూర్తికాని పరిస్థితి. ప్రస్తుతం అలాంటి బాధలు లేకుండా ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్‌లో తీసుకునే అవకాశం రవాణాశాఖ కల్పిస్తోంది. ద్విచక్రవాహనం, కారు, ఏ వాహనం నడపా లన్నా ఆ వాహన ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పొల్యుషన్ పత్రం తో పాటు ప్రధానమైనది డ్రైవింగ్ లైసెన్స్. వాహనం నడపాలటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఇది లేకుండా వాహనం నడిపినప్పుడు తనిఖీ అధికారులు పట్టుకుంటే జరిమానా విధిస్తారు. చాలా మంది డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్‌ను మరిచిపోతుంటారు. కొత్తగా డ్రైవింగ్ లెసెన్స్ తీసుకున్నప్పుడు వయసు ఆధారంగా కొన్నేళ్ల గడువుతో జారీ చేస్తారు. ఈ గడువు ముగిసేలోగా రెన్యూవల్ చేసుకోవా లి. గడువు ముగిసిన 30 రోజుల్లో (గ్రేస్ పీరియడ్) రెన్యూవల్ చేసుకోకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసి ఎక్కువ రోజు లైతే దాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. అందుకే డ్రైవిం గ్ లైసెన్సు పై గడువును చూసుకుని రెన్యూవల్ చేసు కోవడం ఉత్తమం. గతంలో డ్రైవింగ్ లైసెన్సు కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అరచేతి నుంచే ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
- ప్రక్రియ ఇలా..
ముందుగా రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి లైసెన్సు ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఎంచుకుంటే మరో పేజీ తెరుచుకుంటుంది. అందులో కింద ఉండే రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్సు పై క్లిక్ చేయాలి. తర్వాత క్లిక్ హియర్ టు బుక్ ది స్లాట్ ఆప్షన్ ఎంచుకోవాలి. మరో కొత్త విండోలో కనిపించే డ్రైవింగ్ లైసెన్స్ బాక్స్‌లోని రెన్యువల్ ఆఫ్ లైసెన్స్, తర్వాత కంటిన్యూ స్లాట్ బుకింగ్‌ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, ఆర్టీఏ కార్యాలయం చిరునామా, పుట్టిన తేదీ, సెల్‌ఫోన్ నంబరు తదితర వివరాలు నమోదు చేయాలి. రిక్వెస్ట్ ఓటీపీని క్లిక్ చేస్తే మీ సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుం ది. దాంతో పాటు క్యాప్చాను ఎంటర్ చేసి గెట్ డిటయిల్స్‌పై నొక్కగానే వివరాలన్నీ కనిపి స్తాయి. జాగ్రత్తగా పరిశీలించి కన్‌ఫాంపై క్లిక్ చేయాలి. తర్వాత మరో విండోలో స్లాట్ కోసం మనకు నచ్చిన తేదీ, సమయం ఎంచుకుని నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం చెల్లించాల్సిన రుసుం మొత్తాన్ని పరిశీలించి పే నౌపై క్లిక్ చేస్తే వచ్చిన పేమెంట్ ఆప్షన్లలో మనకు అనుమైన దానిని ఎంచుకుని పే చేస్తే స్లాట్ బుక్ అవుతుంది. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వస్తుంది. వీటిని ప్రింట్ తీసుకోవాలి. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌పై వైద్యాధికారి తో సంతకం చేయించి ఆధార్, ఒరిజనల్ డ్రైవింగ్ లైసెన్సును స్లాట్ బుక్ అయిన రోజున ఆర్టీఏ కార్యాలయంలో అందజేయాలి. కొద్ది రోజుల్లోనే రెన్యూవల్ అయిన డ్రైవింగ్ లైసెన్సు వస్తుంది.
Updated Date - Jul 19 , 2025 | 11:29 PM