ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నకిరేకల్‌లో డ్రైనేజీలు లేక అవస్థలు

ABN, Publish Date - Jun 04 , 2025 | 12:25 AM

భారీ వర్షాలు కురిసినప్పుడు నకిరేకల్‌ మునిసిపాలి టీ పరిధిలో కొన్ని వార్డులు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. డ్రైనేజీ పూర్థిస్థాయిలో ని ర్మాణం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

నకిరేకల్‌ మెయిన సెంటర్‌లోని ఎన్జీవో కార్యాలయం వద్ద నిర్మిస్తున్న డ్రైనేజీ

నకిరేకల్‌లో డ్రైనేజీలు లేక అవస్థలు

నకిరేకల్‌, ఆంధ్రజ్యోతి

భారీ వర్షాలు కురిసినప్పుడు నకిరేకల్‌ మునిసిపాలి టీ పరిధిలో కొన్ని వార్డులు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. డ్రైనేజీ పూర్థిస్థాయిలో ని ర్మాణం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మునిసిపల్‌ పరిధిలో 20 వార్డులు ఉన్నా కొన్ని వార్డుల్లో మాత్రం డ్రైనేజీ సమస్యతో ఆ కాలనీవాసులు వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కొన్ని వార్డుల్లో డ్రైనేజీ పూర్తిస్థాయిలో ఉన్నా మరికొన్ని వార్డుల్లో అధ్వానంగా ఉన్న డ్రైనేజీ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా నకిరేకల్‌ మెయిన సెంటర్‌లోని ఎన్జీవో కార్యాలయం, కోర్టు ప్రాంతంలో వర్షాలు వచ్చినప్పుడు మురుగునీరు ఎక్కువగా నిలిచి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వీరేశం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రూ.1.70కోట్లు మంజూరు చేయించారు. డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడంతో పనులు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే కొంత సమస్య పరిష్కారం కానుంది.

Updated Date - Jun 04 , 2025 | 12:25 AM