మల్కాపూర్‌లో డ్రైనేజీ నిర్మాణం పునరుద్ధరించాలి
ABN, Publish Date - Apr 10 , 2025 | 11:37 PM
నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ని ర్మించిన డ్రైనేజీ నిర్మాణం పూర్తిగా దెబ్బతిన్నదని, వెంటనే పునరుద్ధ రించా లని సీపీ ఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో గురు వారం రిలే నిరాహార దీక్షలు ప్రా రంభించారు.
కందనూలు, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ని ర్మించిన డ్రైనేజీ నిర్మాణం పూర్తిగా దెబ్బతిన్నదని, వెంటనే పునరుద్ధ రించా లని సీపీ ఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో గురు వారం రిలే నిరాహార దీక్షలు ప్రా రంభించారు. ఈ సందర్భంగా జరి గిన కార్యక్రమానుద్దేశించి సీపీఎం జిల్లా కార్యద ర్శివర్గ సభ్యురాలు కందికొండ గీత మాట్లాడు తూ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక రకాల సమస్యలు తమ పార్టీ సర్వేలో వెలుగులోకి వ చ్చాయన్నారు. రోడ్డు, డ్రైనేజీ, మంచినీరు, విద్యు త్, లైట్లు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర మైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటి కైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మల్కాపురం ఊట కాల్వ డ్రైనేజీని పూడిక తీసి వెంటనే పునరుద్దరించాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పొదిల రామయ్య, నాగరాజు గౌడ్, సభ్యులు శ్రీనివాసులు, మహేష్, లింగం, కృష్ణ, వెంకటయ్య, బాలస్వామి, వేణు, భాస్కర్, కృష్ణయ్య పాల్గొన్నారు.
Updated Date - Apr 10 , 2025 | 11:37 PM