ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాటలతో కాలయాపన వద్దు

ABN, Publish Date - Jul 17 , 2025 | 12:28 AM

‘మోసపూరితమైన మాట లు చెబుతూ పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించకుండా కాలయాపన ఎందుకు చేస్తున్నారు’ అని చర్లగూడెం రిజర్వాయర్‌ భూనిర్వాసితులు అధికారులను నిలదీశారు.

దీక్షా శిబిరం వద్ద భూనిర్వాసితులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ శ్రీనివాస్‌

పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించాలి

అధికారులను నిలదీసిన చర్లగూడెం భూనిర్వాసితులు

మర్రిగూడ, జూలై 16(ఆంధ్రజ్యోతి): ‘మోసపూరితమైన మాట లు చెబుతూ పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించకుండా కాలయాపన ఎందుకు చేస్తున్నారు’ అని చర్లగూడెం రిజర్వాయర్‌ భూనిర్వాసితులు అధికారులను నిలదీశారు. పునరావాసం, ఆర్‌ అండ్‌ఆర్‌ ప్యాకేజీ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నిర్వాసితులు నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం చర్లగూడెం రిజర్వాయర్‌ క్యాంప్‌ కార్యాలయం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరుకున్నాయి. తహసీల్దార్‌ జక్కర్తి శ్రీనివాస్‌ దీక్ష శిబిరం వద్దకు చేరుకొని వారితో మాట్లాడారు. పనులు అడ్డుకోవ ద్దని, సహకరించాలని కోరారు. అర్హులైన బాధితులందరికీ ప్రభు త్వం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పునరావాసం కల్పిస్తుందని, దీక్షను విరమించాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మా ట్లాడుతూ 12సంవత్సరాల నుంచి పునరావసం, ఆర్‌అండ్‌ ఆర్‌ ప్యాకేజీ చెల్లించాలని పలుమార్లు రిజర్వాయర్‌ పనులు అడ్డుకున్న ప్రతి సందర్భంలో మీకు న్యాయం చేస్తామని, సహకరించాలని చెప్పి వెళ్లిపోతున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. మా సమస్యలు ఎందుకు పరిష్కరిం చడం లేదని అధికారులను ప్రశ్నించారు. పునరావసం ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యే క ప్యాకేజీ చెల్లించే వరకు రిజర్వాయర్‌ నిర్మాణం పనులు అడ్డుకుంటామని, అప్పటి వరకు దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. భూనిర్వాసితులకు తహసీల్దార్‌ శ్రీనివాస్‌ ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఆయన వెనుదిరిగారు.

కలెక్టర్‌ హామీతో దీక్ష విరమణ

భూనిర్వాసితులు మూడు రోజులుగా చేపట్టిన ధర్నాకు జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి స్పందించారు. కలెక్టర్‌ తరుఫున చండూరు ఆర్డీవో శ్రీదేవి, మర్రిగూడ తహసీల్దార్‌ జక్కర్తి శ్రీనివాస్‌ బుధ వారం సాయంత్రం నిర్వాసితులతో మాట్లాడారు. చింతపల్లి మం డలం వర్కల గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్‌ 173లో 35 ఎకరాల భూమిని భూ నిర్వాసితుల పునరావాసం కోసం స్థలం సేకరించామన్నారు. ఈ భూ సేకరణ ప్రక్రియ 10 రోజుల్లో ప్రారంభమవుతుందని కలెక్టర్‌ హామీ ఇచ్చారని ఆర్డీవో తెలిపారు. దీక్ష విరమిస్తున్నామని భూ నిర్వాసితులు ప్రకటించారు.

Updated Date - Jul 17 , 2025 | 12:28 AM