ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అలసత్వం వద్దు

ABN, Publish Date - Jun 04 , 2025 | 11:03 PM

రైతు లు భూ సమస్యలపై ఇచ్చే దరఖాస్తుల స్వీకరణ లో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని అ దనపు కలెక్టర్‌ అమరేందర్‌ సూచించారు.

పెద్దకొత్తపల్లి : ఆదిరాల రెవెన్యూ సదస్సులో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ అమరేందర్‌

- ఆదిరాల రెవెన్యూ సదస్సులో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌

పెద్దకొత్తపల్లి, జూన్‌ 4 (ఆంఽధ్రజ్యోతి) : రైతు లు భూ సమస్యలపై ఇచ్చే దరఖాస్తుల స్వీకరణ లో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని అ దనపు కలెక్టర్‌ అమరేందర్‌ సూచించారు. భూ భారతి నూతన చట్టంలో భాగంగా రెండవరోజు బుధవారం మండలంలోని ఆదిరాల గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది. అదనపు కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. రైతుల దరఖాస్తులను అవకాశం ఉంటే అక్కడే పరిశీలించి అధికారులు పరిష్కరించాలని సూచించారు. పెద్ద ఆదిరాలలో 13 దరఖాస్తులు తహసీల్దార్‌ శ్రీనివాసులు తెలిపారు. చిన్నకార్పాములలో 35 దరఖాస్తులు వచ్చాయని డిప్యూటీ తహసీల్దార్‌ రమేష్‌ తెలి పారు. పెద్దకొత్తపల్లి సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. సదస్సులో సింగిల్‌ విండో సీఈవో ఎండీ సిరాజ్‌, గ్రామ పెద్దలు ములక పల్లి రామస్వామి, గోరింట్ల మల్లేష్‌యాదవ్‌, రవీందర్‌రెడ్డి, వెంకటయ్య, మద్దెల శివకృష్ణ, స్వామి పాల్గొన్నారు.

ఫ కల్వకుర్తి : మండల పరిధిలోని లింగసా నిపల్లి, వెంకటాపూర్‌ గ్రామాల్లో తహసీల్దార్‌ ఇ బ్రహీం ఆధ్వర్యంలో సదస్సులు జరిగాయి. లింగ సానిపల్లిలో సదస్సులో ఆర్డీవో ఎస్‌.శ్రీను పాల్గొ న్నారు. లింగసానిపల్లిలో 28, వెంకటాపూర్‌ 5 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్‌ తెలిపారు.కార్యక్రమంలో డీ టీలు, ఆయా గ్రామాల నా యకులు పాల్గొన్నారు.

ఫ కొల్లాపూర్‌ : కొల్లాపూ ర్‌ మునిసిపాలిటీ పరిధిలోని చౌటబెట్ల గ్రామంతో పాటు మండల పరిధిలోని మాచినే నిపల్లి గ్రామంలో రెవెన్యూ సద స్సులు జరిగాయి. సదస్సుల్లో ఆ యా గ్రామాల నుంచి 43 దరఖాస్తులు వచ్చా యని కొల్లాపూర్‌ తహసీల్దార్‌ విష్ణువర్ధన్‌ పేర్కొ న్నారు.

ఫ చారకొండ : మండలంలోని చారకొండ, జూపల్లి గ్రామాల్లో రైతువేదికలో రెవెన్యూ సద స్సులు నిర్వహించారు. కార్యక్రమంలో చారకొండ తహసీల్దార్‌ అద్దంకి సునీత, నాయబ్‌ తహసీల్దా ర్‌ విద్యాధరిరెడ్డి, ఎంఆర్‌ఐ భరత్‌కుమార్‌గౌడ్‌, ఏఆర్‌ఐ రామకృష్ణ, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీను, సర్వేయర్‌ శ్రీదేవి, జూనియర్‌ అసిస్టెంట్లు శ్రీను, రాజు, శివకృష్ణ, తరుణ్‌, వందనమ్మ పాల్గొన్నారు.

ఫ తిమ్మాజిపేట : మండల పరిధిలోని ఇప్ప లపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సద స్సులో తహసీల్దార్‌ రామకృష్ణయ్య పాల్గొని రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిం చారు. అదేవిధంగా గుమ్మకొండలోను రెవెన్యూ సదస్సు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్‌ జ్యోతి గిరివర్ధన్‌, రవిచంద్ర, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీకాంత్‌, రెవెన్యూ సిబ్బంది ఉదయ్‌కుమార్‌, రామచంద్రయ్య, భాగ్యమ్మ పాల్గొన్నారు.

ఫ తాడూరు : మండలంలోని యత్మతా పూర్‌, యంగంపల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సు లు నిర్వహించారు. రైతుల నుంచి తహసీల్దార్‌ జయంతి దరఖాస్తులను స్వీకరించారు. మండల స్థాయిలో పూర్తికాని సమస్యలను ఆర్డీవో, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామ న్నారు. ఈ సదస్సులో డిప్యూటీ తహసీల్దార్‌ మహమ్మద్‌ అలీ, ఆర్‌ఐలు, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యద ర్శులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 11:03 PM