సాగు భూముల జోలికి వెళ్లొద్దు..
ABN, Publish Date - May 31 , 2025 | 10:40 PM
సాగులో ఉన్న భూముల జోలికి అటవీశాఖ అధికారులు వెళ్లవద్దని రాష్ట్ర రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. మంచిర్యాల కలెక్టరేట్ సమా వేశ మందిరంలో శనివారం ధాన్యం కొనుగోళ్లు, ఇందిర మ్మ ఇళ్లు, భూ భారతి, వానాకాలం సాగు సన్నద్ధతపై ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్ష సమావేశం శనివారం ఏ ర్పాటు చేశారు.
-అటవీ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
-నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే పీడీ యాక్టు
-విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందాలి
-ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
-ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షలో మంత్రి దిశానిర్దేశం
మంచిర్యాల, మే 31 (ఆంధ్రజ్యోతి): సాగులో ఉన్న భూముల జోలికి అటవీశాఖ అధికారులు వెళ్లవద్దని రాష్ట్ర రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. మంచిర్యాల కలెక్టరేట్ సమా వేశ మందిరంలో శనివారం ధాన్యం కొనుగోళ్లు, ఇందిర మ్మ ఇళ్లు, భూ భారతి, వానాకాలం సాగు సన్నద్ధతపై ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్ష సమావేశం శనివారం ఏ ర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మం త్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ పోడు వ్యవసాయం చే స్తూ ఎప్పటి నుంచో సాగులో ఉన్న వారిని అటవీ అ ధికారులు అత్యవసరంగా ఎలా అడ్డుకుంటారన్నారు. అవసరమైతే పంట చేతికి వచ్చిన తరువాత గ్రామాల్లో సమీక్షలు ఏర్పాటు చేసి, భూములను నిర్దారించాలని సూచించారు. యాసంగి ధాన్యం సేకరణ చివరి దశకు చేరుకుందని, తడిసిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అభివృద్ధి విషయంలో వివి ధ పత్రికలు రాసే కథనాల్లో వాస్తవాలు ఉంటే సంబం ధిత అధికారులు తప్పులను సరిదిద్దుకోవాలని, లేనిప క్షంలో రిజైండర్లు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.
నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు...
వానాకాలం సీజన్ ఈ సంవత్సరం ముందస్తుగా ప్రారంభమైందని, రైతులకు ఎరువులు, విత్తనాల విష యంలో ఇబ్బందులు కలగకుండా వ్యవసాయశాఖ అధి కారులు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదే శించారు. అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయి స్తూ, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నకిలీ, నిషేధిత వి త్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ విషయమై కం పెనీల నిర్వాహకులు, డీలర్లతో సమావేశాలు నిర్వహిం చి, నకిలీ విత్తనాలు సరఫరా చేయకుండా కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాలన్నారు.
వరద ప్రభావిత ప్రజలను అప్రమత్తం చేయాలి....
వర్షాకాలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్య నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నీటిపా రుదల, వైద్య ఆరోగ్య, వ్యవసాయశాఖలు, సంబంధిత శాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని చేపట్టిన కా ర్యక్రమాలపై కార్యచరణ రూపొందించుకోవాలన్నారు. జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న దృ ష్ట్యా పాఠశాలలు, వసతిగృహాలు సిద్ధం చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నా రు. అంగన్‌వాడీ టీచర్లకు రూ. 2 లక్షల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, వేసవి సెలవులు ఇస్తామన్నారు.
భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి...
భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ భారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం-2025లో భాగం గా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో ఉమ్మడి ఆదిలా బాద్‌లోని ఒక్కో జిల్లాకు ఒక్కో మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేస్తామన్నారు. సమస్యలను ఈ నెల 2 నుంచి పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.
పేదలకే ఇందిరమ్మ ఇళ్లు....
నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కేటా యించామని తెలిపారు. అత్యంత పేదవారికి జాబితా లో చోటు కల్పిస్తామన్నారు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పీవీటీజీలు, ఇతర ఆదివాసీలకు 5 వేల ఇందిరమ్మ ఇళ్లు ప్రత్యేకంగా కేటాయించామని తె లిపారు. ఈ నెల 2న అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇ ళ్లు నిర్మాణానికి ముగ్గు పోసి, నిర్మాణం ప్రారంభించా లన్నారు.
ఎరువులు అందుబాటులో ఉంచాలి...
మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్
వానాకాలం సీజన్ ప్రారంభమైనా రైతులకు సరిప డా ఎరువులు, విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటు లో లేవని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నా రు. జిల్లాలో ప్రస్తుతానికి కేవలం 5 శాతం మాత్రమే ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఈ విషయంలో వ్యవసాయశాఖ విఫలమైందని అన్నారు. సకాలంలో ఎరువులు అందకపోతే రైతులు రోడ్డెక్కుతారని అన్నా రు.
మున్సిపాలిటీలకు రూ. 50 కోట్లు కేటాయించాలి...
బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి నియోజక వర్గంలోని మున్సిపాలిటీల్లో టా య్‌లెట్ల నిర్మాణం కోసం రూ. 50 కోట్లు కేటాయిం చా లని మంత్రిని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. నియో జకవర్గంలోని వేమనపల్లి, కన్నెపల్లి మండలాల్లో 40 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను అటవీ అఽధికారులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.
అనంతరం కిశోర బాలికలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి కుమ్రంభీం ఆసిఫా బాద్ జిల్లాలోని కిశోర బాలికలకు ఇందిరమ్మ అమృతం పథకం కింద పల్లీలు, చిరుధాన్యాలతో తయారుచేసిన చిక్కీలు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో మంచి ర్యాల, బెల్లంపల్లి, ముథోల్ ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేం సాగర్‌రావు, గడ్డం వినోద్, రామారావు పటేల్, శాసన మండలి సభ్యులు మల్క కొమురయ్య, దండే విఠల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, అదిలాబాద్, ని ర్మల్ జిల్లాల కలెక్టర్లు కుమార్ దీపర్, వెంకటేష్ దోత్రే, రాజార్షి షా, అభిలాష అభినవ్, సమగ్ర గిరిజన అభి వృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, గిరిజన సమగ్ర సంస్థ చైర్మన్ కొట్నాక తిరుపతి, మం చిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ తోపాటు అటవీ, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులు, పాల్గొన్నారు.
Updated Date - May 31 , 2025 | 10:40 PM