ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దళారులకు ధాన్యం విక్రయించొద్దు

ABN, Publish Date - Apr 08 , 2025 | 12:26 AM

రైతులు తాము పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు విక్రయించి, ఆర్థికంగా నష్టపోవద్దని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కోరారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

మోత్కూరు/అడ్డగూడూరు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): రైతులు తాము పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు విక్రయించి, ఆర్థికంగా నష్టపోవద్దని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కోరారు. సోమవారం మండలంలోని పాటిమట్లలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు తొందర పడకుండా నాణ్యత ప్రమాణాలకనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2320 పొందాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన పేలపూడి వెంకటేశ్వర్లు, కాంగ్రె స్‌ నాయకులు రాచకొండ బాలరాజు, పేలపూడి సత్యనారాయణఛౌదరి, రాములు, ఐకేపీ కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు. మోత్కూరు సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఆ సంఘం పరిధిలోని పొడిచేడు, అనాజిపురం, కప్రాయపల్లి, రహీంఖానపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆ సంఘం చైర్మన పేలపూడి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. సంఘం సీఈవో కె.వరలక్ష్మీ స్థానిక నాయకులు, సింగిల్‌ విండో డైరెక్టర్లు పాల్గొన్నారు. అడ్డగూడూరు మండలంలోని జానకీపురం, చిర్రగూడూరు గ్రామాల్లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి సరైన తేమశాతం వచ్చేలా చూసుకుని, నిర్వాహకులకు సహకరించాలని ఆయన కోరారు. అనంతరం అడ్డగూడూరు మండలంలోని జానకీపురం గ్రామానికి చెందిన అంబటి రామచంద్రు ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. అలాగే పేదలకు కడుపు నిండా నాణ్యమైన భోజనం అందించమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్నదానం చేసిన కుటుంబ సభ్యులకు నూతన వసా్త్రలను ఎమ్మెల్యే మందుల సామేలు అందజేశారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన కొప్పుల నిరంజనరెడ్డి, తహసీల్దార్‌ శేషగిరిరావు, ఎంపీడీవో శంకరయ్య, ఏవో పాండురంగాచారి, సీఈవో వెంకటేశ్వర్లు, మోత్కూరు మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన లింగాల నర్సిరెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు నిమ్మనగోటీ జోజి, డైరక్టరు బాలెంల విద్యాసాగర్‌, సినియర్‌ నాయకులు కోట విద్యాసాగర్‌రెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:26 AM