ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అటవీ జంతువులకు హాని తలపెట్టొద్దు

ABN, Publish Date - Apr 17 , 2025 | 11:12 PM

అట వీ జంతువులు వ్యవ సాయ పొలాల్లోకి, గ్రా మాల్లోకి ప్రవేశిస్తే వెం టనే అటవీశాఖ అధి కారులకు సమాచారం ఇవ్వాలని, ఎలాంటి పరిస్థితిలోనూ వాటికి హాని తలపెట్టవద్దని నా గర్‌కర్నూల్‌ ఫారెస్టు రేం జ్‌ అధికారి దేవరాజు అన్నారు.

బాధిత రైతులకు పరిహారం చెక్కులను అందజేస్తున్న ఎఫ్‌ఆర్‌వో దేవరాజు

- నాగర్‌కర్నూల్‌ ఎఫ్‌ఆర్‌వో దేవరాజు - నష్టపోయిన రైతులకు పరిహారం పంపిణీ

నాగర్‌కర్నూల్‌టౌన్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : అట వీ జంతువులు వ్యవ సాయ పొలాల్లోకి, గ్రా మాల్లోకి ప్రవేశిస్తే వెం టనే అటవీశాఖ అధి కారులకు సమాచారం ఇవ్వాలని, ఎలాంటి పరిస్థితిలోనూ వాటికి హాని తలపెట్టవద్దని నా గర్‌కర్నూల్‌ ఫారెస్టు రేం జ్‌ అధికారి దేవరాజు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ అధికారి కార్యాల యంలో అటవీ జంతువుల వల్ల నష్టపోయిన రైతులకు ఫారెస్టు అధికారులు నష్టపరిహారం పంపిణీ చేశారు. రేంజ్‌ అధికారి దేవరాజు బాధి త రైతులకు మొత్తం రూ.3.12 లక్షల పరిహారం చెక్కులను అందజేశారు. చెక్కులు అందుకున్న వారిలో వెల్డండ మండలానికి చెందిన రవీంద ర్‌రెడ్డి, లక్ష్మయ్య, నరసమ్మ, సైదమ్మ, వంగూరు కు చెందిన బి.శ్రీనివాస్‌, బిజినేపల్లి మండలానికి చెందిన కప్పిరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఊర్కొండ మండలానికి చెందిన ఆంజనేయులు, బి.లక్ష్మ య్య, శ్రీనివాస్‌గౌడ్‌, పద్మ ఉన్నారు. ఈ సంద ర్భంగా రేంజ్‌ అధికారి దేవరాజ్‌ మాట్లాడుతూ అటవీ జంతువుల వల్ల నష్టం జరిగితే సంబం ధిత అటవీశాఖ కార్యాలయాన్ని సంప్రదించి నష్ట పరిహారం పొందవచ్చని ఆయన తెలిపా రు. కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్‌ అధికారి చంటి, చంద్రుడు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:12 PM