అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
ABN, Publish Date - May 15 , 2025 | 11:56 PM
నార్కట్‌పల్లి మండల కేం ద్రంలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నార్కట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధి 4వ వార్డులోని కొ న్ని నివాస సముదాయాల మధ్య వ్యర్థపు నీరు చేరి మురికి కూ పంలా మారింది.
అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
నివాసాల మధ్యే మురుగునీరు
పందుల సంచారం.. దోమల బెడద
దుర్వాసన.. దుర్గంధంతో అనారోగ్యం
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నార్కట్‌పల్లి, మే 15 (ఆంధ్రజ్యోతి): నార్కట్‌పల్లి మండల కేం ద్రంలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నార్కట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధి 4వ వార్డులోని కొ న్ని నివాస సముదాయాల మధ్య వ్యర్థపు నీరు చేరి మురికి కూ పంలా మారింది. దీంతో దుర్గంధం, దుర్వాసనలతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మురుగునీటిలో పందులు సంచరిస్తుండటంతో దుర్గంధం పెరుగుతోంది. దోమలు కుప్పలు కుప్పలుగా పెరుగుతున్నాయి. అనారోగ్యం బారిన పడతామనే భ యం ఒక వైపు ఉండగా ఇంకిన మురికి నీరు పునాదుల్లోకి చేరి ఎక్కడ ఇళ్లకు నష్టం కలుగుతుందేమోనని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతు న్నారు. పట్టణంలోని 4 వార్డులోని ఓ వాటర్ ప్లాంట్ పక్కనే పన్నాల గో పాల్‌రెడ్డికి చెందిన షట్టర్లు, మామిడి విజయ్, నడింపల్లి పెంటమ్మలకు చెందిన ఖాళీ ఇంటి స్థలాలు ఉన్నాయి. అయితే మెయిన రోడ్డుకు ఉన్న కల్వర్టు (మోరీ) ద్వారా ఎగువన ఉన్న నివాసాలు, ఫంక్షన హాళ్ల నుంచి వచ్చే మురుగునీరు ఈ రోడ్డు కల్వర్టు ద్వారా వచ్చి ఖాళీ ప్లాట్ల స్థలంలో చేరి మురికికూపంలా తయారైంది. వాస్తవానికి అక్కడ చేరిన మురుగునీరు దిగువకు వెళ్లాల్సి ఉంది. కానీ పట్టణీకరణలో భాగంగా క ట్టిన నిర్మాణాలు అడ్డంగా ఉండటం, దీనికి తోడు మాజీ వార్డు సభ్యుడు అజీజ్ ఇంటి నుంచి అయ్యప్ప కాలనీకి వెళ్లే దారి విషయంలో ఏర్పడిన వివాదం అపరిష్కృతంగా ఉండటంతో డ్రైనేజీ నిర్మాణానికి ఆటంకంగా మారింది. వేసవికాలంలోనే నీరు చేరి పరిస్థితి ఇలా ఉంటే వర్షాకాలంలో తమ నివాసాలు మునిగిపోవడం ఖాయమనే ఆందోళన చెందుతున్నా రు. ఈ సమస్యను ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరించాలని ఎమ్మెల్యే చెప్పినా ఫలితం లేదని వాపోతున్నారు.
డ్రైనేజీని వెంటనే ఏర్పాటు చేయాలి
తమ ఇళ్ల సముదాయం మధ్యలో ము రుగు నీరు చేరి నానా ఇబ్బందులు పడు తున్నాం. డ్రైనేజీ లేక ఎగువనుంచి వచ్చే మురుగునీరంతా మా ఇంటి సముదా యం పక్కనే చేరుతోంది. గతంలో ఇదే దారిలో వచ్చే మురికి నీరు పోవడానికి ఉన్న డ్రైనేజీ ఇప్పుడెందుకు లేదో అధికా రులు పరిశీలించాలి. ప్రత్యామ్నాయ డ్రైనేజీని నిర్మించాల్సిన బాధ్య త గ్రామ పంచాయతీ అధికారులపై ఉంది. తక్షణమే స్పందించి డ్రైనేజీ నిర్మించి సమస్యకు పరిష్కారం చూపాలి.
- పన్నాల గోపాల్‌రెడ్డి, బాధితుడు
సమస్యను పరిష్కరిస్తాం
గోపాల్‌రెడ్డి నివాస సముదాయం వ ద్ద వ్యర్థనీరు చేరి మురికికూ పంగా మా రిన సమస్య వాస్తవమే. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా డ్రైనేజీ నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికి తోడు అజీజ్ ఇం టికి వెళ్లే దారి వివాదం ఇంకా పరిష్కా రం కాని కారణంగా ఇక్కడ లింకు డ్రైనేజీ నిర్మించలేకపోతున్నాం. గత వర్షాకాలంలో రోడ్డు మోరీ ద్వారా నీరు చేరి ఇళ్లు నీట మునిగే పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా తాత్కాలిక డ్రైనేజీ తవ్వి నీటిని దారి మళ్లించాం. స్థానికులు, తమ పైఅధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమ స్య పరిష్కారానికి కృషి చేస్తా.
- సుభాన, పంచాయతీ కార్యదర్శి
Updated Date - May 15 , 2025 | 11:56 PM