ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైస్‌మిల్లు వేబ్రిడ్జి తూకంలో తేడా

ABN, Publish Date - Apr 11 , 2025 | 12:38 AM

రైస్‌మిల్లులకు అనుసంధానంగా పనిచేస్తున్న బారుకాంటా (వేబ్రిడ్జి)లో తూకంలో జరుగు తున్న మోసాన్ని తూనికలు, కొలతల అధి కారులు తనిఖీల్లో బహిర్గతం చేశారు.

వేబ్రిడ్జిని తనిఖీ చేస్తున్న లీగల్‌ మెట్రాలజీ అధికారి రామకృష్ణ

వేములపల్లి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): రైస్‌మిల్లులకు అనుసంధానంగా పనిచేస్తున్న బారుకాంటా (వేబ్రిడ్జి)లో తూకంలో జరుగు తున్న మోసాన్ని తూనికలు, కొలతల అధి కారులు తనిఖీల్లో బహిర్గతం చేశారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరి ధిలో గురువారం జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శెట్టిపాలెం గ్రామ పరిధిలోని మహాతేజ రైస్‌మిల్లుకు సంబంధి ంచిన వేబ్రిడ్జిని అధికారులు తనిఖీ చేయగా, పది టన్నుల ధాన్యం తూకంలో 40కేజీల తేడాను అధికారులు గుర్తించారు. యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మహా తేజ రైస్‌మిల్లు కీలకంగా వ్యవహరించింది. ఈ రైస్‌మిల్లుకు అనుసంధానంగా మరో రైస్‌మిల్లును నడిపిస్తుండగా నిత్యం సుమారు 600 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతోంది. ధాన్యం విక్రయాల్లో ఏర్పడ్డ అసౌకర్యం, రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు మిల్లు యాజమా న్యం ఽమద్దతు ధర చెల్లించకుండా విక్రయాలు కొనసాగిస్తూనే మరోవైపు ధాన్యం తూకంలో మోసం చూస్తూ రైతుల ఆరుగాల కష్టాన్ని అందినంతగా దొచుకుంటున్న తీరు తూని కలు, కొలతల అధికారుల తనిఖీలతో బయట పడడంతో బాధిత రైతులు లబోదిబో మంటున్నారు. తూకంలో మోసాలకు పాల్పడుతున్న రైస్‌మిల్లుపై కేసు నమోదు చేసి రూ. 1.25లక్షల జరినామా విధించినట్లు జిల్లా లీగల్‌మెట్రాలజీ అధికారి రామకృష్ణ తెలిపారు. రైలు మిల్లు తూకాల్లో జరు గుతున్న మోసాలపై అనుమానం కలిగినా ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించి తనిఖీలు జరిపి కేసులు నమోదు చేస్తామన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:39 AM