అక్రమ కట్టడాల కూల్చివేతలు...!
ABN, Publish Date - Jun 17 , 2025 | 11:15 PM
మంచిర్యాల పట్టణంలో ఇంతకాలం ప్రభుత్వ భూములు, ఫుట్‌పాత్ ల్లో ఏర్పాటు చేసుకున్న అక్రమ నిర్మాణాలపై మున్సిప ల్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. జిల్లా కేంద్రం లో ఇరువైపులా డ్రైనేజీల వరకు రోడ్ల విస్తరణకే ప్రా ధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నారు.
-కొనసాగుతున్న పనులు
-పక్షపాతం లేకుండా ఆక్రమణలన్నీ తొలగింపు
-డ్రైనేజీల వరకు రోడ్ల విస్తరణకే ప్రాధాన్యం
-సెల్లార్లపైనా ధృష్టిసారించాలంటున్న ప్రజలు
మంచిర్యాల, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల పట్టణంలో ఇంతకాలం ప్రభుత్వ భూములు, ఫుట్‌పాత్ ల్లో ఏర్పాటు చేసుకున్న అక్రమ నిర్మాణాలపై మున్సిప ల్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. జిల్లా కేంద్రం లో ఇరువైపులా డ్రైనేజీల వరకు రోడ్ల విస్తరణకే ప్రా ధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రం లో రోజు రోజుకూ విస్తరిస్తున్న ఆక్రమణలపై ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే సూచ నల మేరకు రోడ్ల స్థలాలను ఆక్రమించి నిర్మించిన కట్ట డాలను తొలగించేందుకు అధికారులు ఇప్పటికే వాటికి మార్కింగ్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు మార్కెట్ రోడ్డులో ఉన్న ఆక్రమణలన్నీ తొలగించగా, ప్రస్తుతం ఆ ప్రాంతం విశాలంగా దర్శనమిస్తోంది. ఇంతకాలం మా ర్కెట్‌లో మోటార్ సైకిల్‌పై ప్రయాణించేందుకే ఇబ్బం దులు తలెత్తేవి. ప్రస్తుతం ఆ రోడ్డు గుండా ఇరువైపులా కార్లు తేలిగ్గా ప్రయాణించగలుగుతున్నాయి. అలాగే బెల్లంపల్లి చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు ఆక్రమ ణల తొలగింపు ఇప్పటికే పూర్తికాగా, జడ్పీ బాలికల పా ఠశాల రోడ్డు, వాటర్ ట్యాంక్ ఏరియా, శ్రీనివాస్ టాకీస్ రోడ్డు, హమాలివాడ ఏరియా, వెంకటేశ్వర టాకీస్ రోడ్డు పనులు కూడా పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాలన్నీ వి శాలంగా దర్శనమిస్తుండగా, ప్రజలకు ఇబ్బందులు తొ లగిపోయాయి. ప్రస్తుతం విశ్వనాథ ఆలయం రోడ్డులో కూల్చివేత పనులు జరుగుతున్నాయి.
సంవత్సరాలుగా పాతుకుపోయారు...!
జిల్లా కేంద్రంలో దాదాపు 15 సంవత్సరాలుగా ఫుట్ పాత్‌లను ఆనుకొని వందల సంఖ్యలో అక్రమ నిర్మాణా లు వెలిశాయి. అందులో చిరువ్యాపారులు టేలాలు ఏ ర్పాటు చేసుకొని జీవనం సాగిస్తుండగా, కొందరు రా జకీయ నాయకులు సైతం తమ చేతివాటం ప్రదర్శిం చినట్లు ఆరోపణలున్నాయి. ఫుట్‌పాత్‌లను ఆనుకొని, వ్యాపారాలకు అనువుగా ఉండే స్థలాలపై కన్నేసిన నా యకులు తమ పలుకుబడితో వివిధ ప్రాంతాల్లో విచ్చ లవిడిగా టేలాలు ఏర్పాటు చేశారు. వాటిని చిరువ్యా పారులకు అద్దెకిస్తూ నెలవారీ అద్దె రూపంలో వేలల్లో దోచుకుంటున్నారు. అయినా ఇంతకాలం వాటిపై ప్ర శ్నించే నాథుడే కరువయ్యారు. ఈ క్రమంలో పట్టణం లో ప్రధాన సెంటర్లయిన జడ్పీ బాలుర ఉన్నత పాఠ శాల, మార్కెట్ రోడ్డు, బాలికల హై స్కూల్, ఐబీ ప్రాం తంతోపాటు టూ టౌన్‌గా పిలవబడుతున్న హమాలి వాడలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిశా యి. వాటి వెనుక ప్రజా ప్రతినిధుల అండ ఉండగా, నెలకు లక్షల రూపాయలు కిరాయిల రూపంలో చేతు లు మారుతుండేవి. గతంలో ఏసీపీగా పనిచేసిన విజ య్‌కుమార్ నేతృత్వంలో మున్సిపల్ అధికారులు అక్ర మ టేలాలపై ధృష్టిసారించి, తొలగించేందుకు ప్రయ త్నించినా, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
బడా వ్యాపార సంస్థలనూ వదలని వైనం...
ఎమ్మెల్యే ఆదేశాలతో చిరువ్యాపారులపై కొరఢా ఝళిపిస్తున్న అధికారులు బడా వ్యాపార సంస్థలపైనా చర్యలు తీసుకుంటారా...? అనే సందేహాలు మొదట్లో వ్యక్తమయ్యాయి. ప్రధానంగా మార్కెట్ రోడ్డులో బడా షాపింగ్ మాల్స్ పదుల సంఖ్యలో ఉన్నాయి. వాటికి ఆనుకొని నిర్మించిన మెట్లు దాదాపుగా ఫుట్‌పాత్‌ను ఆనుకొని నిర్మించారు. అవి తొలగిస్తేగానీ అక్రమణలు పోయి, రహదారులు పూర్వపు కళను సంతరించుకొనే అవకాశం ఉండేది. అయితే పలుమార్లు బడా షాపింగ్ కాంప్లెక్స్‌ల మెట్లు తొలగించేందుకు అధికారులు ప్రయ త్నించినా, ఒత్తిళ్ల కారణంగా అవి సఫలీకృతం కాలేదు. కేవలం చిరు వ్యాపారులపైనే తమ ప్రతాపం చూపిం చేవారు. దీనికి భిన్నంగా పక్షపాత ధోరణిని విడిచి డ్రైనేజీల వరకు అన్ని ఆక్రమణలను తొలగిస్తున్నారు. అదేవిధంగా పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆక్ర మణలను సైతం త్వరగా తొలగిస్తే మంచిర్యాల నగరం సర్వాంగ సుందరాంగ తయారవుతుందనడంలో ఎలాంతి అతిశయోక్తిలేదు.
సెల్లార్లను ఖాళీ చేయించాలి...
జిల్లా కేంధ్రంలోని ప్రధాన వీధుల్లో ప్రస్తుతం వా హనాల పార్కింగ్‌కు ఇబ్బందులు లేకపోయినా, బహుళ అంతస్థుల భవనాల సెల్లార్లనూ ఖాళీ చేయించాలనే డి మాండ్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో విపరీతమైన ట్రా ఫిక్ కారణంగా పలు రోడ్లు కిక్కిరిసి పోతున్నాయి. ఈ క్రమంలో వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి వాహనా ల పార్కింగ్ పెద్ద సమస్యగా తయారైంది. ముఖ్యంగా పండుగల దినాలలో పరిస్థితి మరింత జఠిలంగా మా రుతోంది. బహుళ అంతస్థుల భవనాల్లో ఏర్పాటు చేసి న షాపింగ్ మాల్స్‌కు సంబంధించి ప్రత్యేకంగా పార్కిం గ్ స్థలం కేటాయించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. భవనాల సెల్లార్లలో పార్కింగ్‌కు స్థలం వదిలివేయాల్సి ఉండగా, యజమానులు వాటిని కూడా అద్దెకు ఇవ్వడంతో వాహనాలు రోడ్డుపైన నిలపాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు సెల్లార్లను ఖాళీ చేయించ డం ద్వారా పార్కింగ్ ఇబ్బందులు తొలగిస్తామని చెబు తున్న అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతుండగా, భవనాల యజమానులు సెల్లార్ల రూపంలో లక్షల్లో కి రాయలు దండుకుంటున్నారు. ప్రస్తుతం అక్రమ నిర్మా ణాలను తొలగిస్తున్నందున సెల్లార్ షాపింగ్‌లపైనా దృ ష్టిసారించాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. సెల్లార్ల ను ఖాళీ చేయించి, పార్కింగ్ ఏర్పాటు చేస్తే రోడ్లపై వాహనాలు నిలిపే అవకాశం ఉండదు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలత్తెకుండా ఉండే అవకాశం ఉంది.
Updated Date - Jun 17 , 2025 | 11:15 PM