ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Danam Nagender: కేటీఆర్‌కు క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదు

ABN, Publish Date - Jan 13 , 2025 | 03:55 AM

ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ విషయంలో తాను కేటీఆర్‌కు క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని చెప్పారు.

  • హైడ్రాతో హైదరాబాద్‌కు చెడ్డపేరు

  • నేను ఫైటర్‌ను.. ఉప ఎన్నికకు భయపడను: దానం

హైదరాబాద్‌ సిటీ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ విషయంలో తాను కేటీఆర్‌కు క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. ఆదివారం జీహెచ్‌ఎంసీలో జరిగిన సమీక్షలో పాల్గొన్న అనంతరం దానం మీడియాతో మాట్లాడారు. ఈ మధ్య తాను ఏం మాట్లాడినా సంచలనం అవుతోందన్నారు. కార్‌ రేస్‌ వల్ల హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగిందని మాత్రమే తాను అన్నానని, అందులో అవినీతి జరగలేదని చెప్పలేదని వెల్లడించారు. రేస్‌ నిర్వహించినప్పుడు కేటీఆర్‌ తన సలహా తీసుకున్నారని తెలిపారు. హైడ్రాతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు.


దీనిపై సర్కారు మరోసారి ఆలోచించాలని కోరారు. మూసీ పక్కన హై కోర్టు, ఉస్మానియా ఆస్పత్రి వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయని, ఆ నది పునరుజ్జీవ ప్రాజెక్టు అవసరమని పేర్కొన్నారు. మూసీపై కంటి తుడుపు చర్యగా బీజేపీ నేతలు బస్తీ నిద్ర చేశారని దానం వ్యాఖ్యానించారు. నిద్ర చేసిన ఇళ్లలో.. ముందే తాత్కాలిక ఏసీలు పెట్టించుకున్నారని ఆరోపించారు. వారి ఇళ్లలో చేసిన జొన్న రొట్టెలు తినకుండా.. కిషన్‌రెడ్డి బయటి నుంచి ఇడ్లీలు తెప్పించుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, అయినా ఇచ్చినా హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ’నేను ఫైటర్‌ను.. ఉప ఎన్నికకు భయపడను’ అని దానం పేర్కొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 03:55 AM