గిరిజన భూములకు సాగు కళ...
ABN, Publish Date - May 22 , 2025 | 12:03 AM
గిరిజనుల బతు కుల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. అడవి బిడ్డల భూములను సశ్యశ్యామలంగా మార్చడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి దోహదం చేయ నుంది.
ఇందిరా గిరివికాసం పథకంతో లబ్ధి
16 మండలాల్లో ఏజెన్సీ స్థలాల సాగు లక్ష్యం
ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన గ్రామీణా భివృద్ధిశాఖ
-జిల్లాలో పలు యూనిట్లకు శ్రీకారం
మంచిర్యాల, మే 21 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల బతు కుల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. అడవి బిడ్డల భూములను సశ్యశ్యామలంగా మార్చడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి దోహదం చేయ నుంది. భూములు ఉండి, ఇంతకాలం సాగు చేయలేని వారి కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందిరా జల గిరివికాసం పేరుతో శ్రీకారం చుట్టింది. పథకంలో భాగంగా తొలుత ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) పరిధిలోని భూములు గల గిరిజను లను ఈ పథకంలో భాగస్వాములను చేయనుంది. గిరి వికాసంలో భాగంగా గిరిజనులందరికీ పథకం వర్తింప జేయగా, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అందుకు భి న్నంగా మొదట అర్హులైన గిరిజన రైతులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గిరిజ నుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. గిరి వికా సం పథకంతో ఇంతకాలం నీటి సదుపాయం లేక బీడు వారిన భూములకు నీటి వసతి, విద్యుత్ మోటార్ ఏ ర్పాటు చేయడం ద్వారా తిరిగి సాగులోకి తేనున్నారు.
పథకానికి ఎంపిక ఇలా...
గిరి వికాసం పథకంలో చేరేందుకు భూములు కలి గిన గిరిజన రైతులు అర్హులు. కనీసం ఇద్దరు రైతులు కలిసి సాగు చేసుకునేందుకు ప్రభుత్వం సహాయ, స హకారాలు అందజేస్తుంది. ఇద్దరు రైతులకు కలిపి కనీ సం ఐదెకరాలు ఒకే చోట భూమి ఉంటేపథకాన్ని అ మలు చేస్తారు. ఒక్కొక్కరికి ఎంత భూమి ఉన్నా కనీ సం రెండున్నర ఎకరాల చొప్పున పరిగణలోకి తీసు కుంటారు. అలా ఇద్దరి పేరిట మొత్తంగా ఐదెకరాలు సాగులోకి వచ్చేలా చర్యలు చేపడతారు. ఒకే రైతుకు ఐదెకరాలు పైబడి ఉన్నా అందులో రెండున్నర ఎకరా లు, అలాగే దాన్ని ఆనుకొని ఉన్న మరో రైతుకు చెంది న రెండున్నర ఎకరాలు తీసుకుంటారు. పథకంలో కనీ సం ఇద్దరు రైతులను ఎంపిక చేస్తుండగా, గరిష్టంగా ఎంతమందినైనా చేరుస్తారు. ఇద్దరు రైతుల కంటే ఎ క్కువ సంఖ్యలో భూములు కలిసి ఉన్న చోట గ్రూపులు గా విభజించి పథకం అమలు చేస్తారు. అలా ఐదెకరా ల చొప్పున ఒక గ్రామంలో ఉన్న భూములన్నీ పథకం లో చేర్చి నీటి సదుపాయం కల్పిస్తారు. పథకంలో చే రేందుకు రైతుల పేరిట ఉన్న భూమి పట్టా, అసైన్డ్ ఏ దైనా పాసుపుస్తుకాలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఏజెన్సీ ఏరియాలో జన్మించిన గిరిజన కులస్థుడై ఉండాలి.
పథకం అమలు ఇలా...
ప్రతి ఐదెకరాల భూమిని సాగులోకి తెచ్చేందుకు రా ష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా గిరి వికా సం పథకాన్ని అమలు చేస్తుంది. మొదట నీటి వసతు ల కోసం భూ పరీక్షలు చేయించి, ఇద్దరి భూములకు ఉపయోకరంగా ఉండేలా బోరుబావి నిర్మిస్తారు. అనం తరం సమీపంలో (ఎంతదూరమైనా)ని విద్యుత్ ప్రసా రం నుంచి త్రీ ఫేజ్ లైన్ ఏర్పాటు చేసి, కనెక్షన్ ఇస్తా రు. ఇందుకోసం ఎన్ని స్తంబాలు అవసరమైనా ప్రభు త్వపరంగా ఏర్పాటు చేస్తారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్లు ఏ ర్పాటు చేయడంతోపాటు 5హెచ్‌పీ మోటారు భిగి స్తా రు. ప్రతీ ఐదెకరాలు సాగు చేసేందుకు కనీసం రూ. 4 లక్షల మేర ఖర్చవుతుండగా, ఆ మొత్తాన్ని ప్రభు త్వమే భరిస్తుంది. అలా అర్హత గలిగిన గిరిజనుల భూముల కు సాగు నీటి సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది.
దరఖాస్తులు ఇలా...
గిరి వికాసం పథకం కోసం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 16 మండలాలకు సంబంధించి మొత్తం 155 గ్రూపుల నుంచి 479 దరఖాస్తులు వచ్చాయి. స్వీకరిం చిన దరఖాస్తుల్లో బోర్‌వెల్ వాడకానికి సంబంధించి 72 యూనిట్లు మంజూరుకాగా, బోర్ డ్రిల్లింగ్ కోసం 68 మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 46 యూని ట్లకు సంబంధించి విద్యుత్ పనులు పూర్తికాగా, 12 మోటార్లను బిగించారు. ఆయా పనులకు సంబంధించి రూ. 3.34 లక్షల బడ్జెట్ కేటాయించగా, ఇప్పటి వరకు రూ. 3.09 కోట్లు ఖర్చు చేశారు.
సాగులోకి పేదల భూములు...
జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి కిషన్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరి వికాసం ప థకాన్ని అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రగతి సాధించాలి. జిల్లాలోని తూటి, కొలాం గిరిజనులతో పా టు ఏజెన్సీ గ్రామాలకు చెందిన గిరిజన రైతులు పథ కానికి అర్హులు. వర్షాధార పంటలపై ఆధారపడి భూ ములు సాగు చేసే రైతులు పథకానికి దరఖాస్తు చేసు కుంటే బోరుబావి నిర్మాణంతోపాటు మోటారు, విద్యు త్ స్తంబాలు, విద్యుత్ కనెక్షన్ పూర్తి ఉచితంగా ఏ ర్పాటు చేస్తాము.
Updated Date - May 22 , 2025 | 12:04 AM