kumaram bheem asifabad- సీఆర్టీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ABN, Publish Date - Jul 26 , 2025 | 11:16 PM
సీఆర్టీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శనివారం పరీక్షల ముఖ్య పర్యవేక్షకులు, శాఖ అధికారులు, పరిశీలకులు, సెట్టింగ్ స్క్వాడ్, రూట్ అధికారులు, ఇన్విజిలేటర్లతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్(సీఆర్టీ) పోస్టులకు నిర్వహించే పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): సీఆర్టీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శనివారం పరీక్షల ముఖ్య పర్యవేక్షకులు, శాఖ అధికారులు, పరిశీలకులు, సెట్టింగ్ స్క్వాడ్, రూట్ అధికారులు, ఇన్విజిలేటర్లతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్(సీఆర్టీ) పోస్టులకు నిర్వహించే పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష ఉంటుందని, సుమారు 1137 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు పోలీసు బందో బస్తు మధ్య పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. ఎలాంటి ఎలకా్ట్రనిక్ వస్తువులను అనుమతించవద్దని, పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, ఎస్సీ అభివృద్ధి అధికారి సజీవన్, డీఎంహెచ్‌వో సీతారాం, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్,, ఇన్‌చార్జి విద్యాధికారి ఉదయ్‌బాబు, మున్సిపల్ కమిషనర్ గజానన్ తదితరులు పాల్గొన్నారు.
సీఆర్టీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
ఆసిఫాబాద్ రూరల్, (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న సీఆర్టీ, ఎస్‌జీటీ పరీక్ష నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న పరీక్షా కేంద్రాన్ని శనివారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఆర్టీ ఎస్‌జీటీ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి కావాల్సిన మౌలిక వసతుల వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు తరగతి గదిలో పాఠ్యాంశాలను బోధించి వారి పఠన సామర్థ్యాలను పరీక్షించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Updated Date - Jul 26 , 2025 | 11:16 PM