ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కిక్కిరిసిన గాంధారీ మైసమ్మ జాతర

ABN, Publish Date - Jul 20 , 2025 | 11:26 PM

మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామం ఆషాఢ మాస బోనాల ఉత్సవంతో పులకించిం ది. గాంధారి మైసమ్మ ఆలయం వద్ద వేలాది మంది భక్తులు శివ సత్తుల పూనకాలతో పులకించింది. రాష్ట్రంలో ఆషాఢమాసం ఉత్స వాలతో గ్రామ దేవతలను పూజించే సంస్కృతిలో భాగంగా మైస మ్మ తల్లికి మొక్కులు చెల్లించేందుకు జిల్లా నలుమూలలతో పాటు మహారాష్ట్రంలోని చంద్రాపూర్‌, నాందేడ్‌, గడ్చిరోలి జిల్లాల నుంచి భక్తులు వచ్చి పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకున్నారు.

బోనమెత్తిన బొక్కల గుట్ట

మొక్కులు చెల్లించుకున్న మంత్రి వివేక్‌

రామకృష్ణాపూర్‌, జూలై20 (ఆంధ్రజ్యోతి): మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామం ఆషాఢ మాస బోనాల ఉత్సవంతో పులకించిం ది. గాంధారి మైసమ్మ ఆలయం వద్ద వేలాది మంది భక్తులు శివ సత్తుల పూనకాలతో పులకించింది. రాష్ట్రంలో ఆషాఢమాసం ఉత్స వాలతో గ్రామ దేవతలను పూజించే సంస్కృతిలో భాగంగా మైస మ్మ తల్లికి మొక్కులు చెల్లించేందుకు జిల్లా నలుమూలలతో పాటు మహారాష్ట్రంలోని చంద్రాపూర్‌, నాందేడ్‌, గడ్చిరోలి జిల్లాల నుంచి భక్తులు వచ్చి పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో జాతీయ రహదారి పక్కనగల గాంధారి మైసమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. దారిపొ డవునా బోనాలతో మహిళలు డప్పు చప్పుళ్లతో తరలివచ్చి మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు.

బోనంతో మొక్కులు చెల్లించిన మంత్రి వివేక్‌...

రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వె ళ్లాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అమ్మవారికి బోనం నెత్తిన పెట్టుకొని మొక్కులు చెల్లించి రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండాలని మొక్కులు చెల్లించారు. మంత్రి మాట్లాడుతూ మైసమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండాలన్నారు. నియోజకవర్గ అ భివృద్ధితో పాటు బొక్కలగుట్ట, గాంధారీ మైసమ్మ ఆలయ అభివృ ద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయంలో అమ్మ వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు, జిల్లా నియోజకవర్గ నాయకులు అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వ హించగా మందమర్రి సీఐ శశిధర్‌, రామకృష్ణాపూర్‌ ఎస్‌ఐ రాజశే ఖర్‌, సర్కిల్‌ పరిధిలో ఉన్నటువంటి ఎస్‌ఐలు ఆయాశాఖల అధికా రులు క్యాతన్‌పల్లి మున్సిపాలిటి, తిమ్మాపూర్‌ పంచాయతీ అధికా రులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేపట్టారు.

Updated Date - Jul 20 , 2025 | 11:26 PM