యాదగిరిగుట్టలో భక్తుల సందడి
ABN, Publish Date - Jul 21 , 2025 | 12:27 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తు లతో యాదగిరికొండపై సందడి నెలకొంది.
యాదగిరిగుట్ట, జూలై 20(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తు లతో యాదగిరికొండపై సందడి నెలకొంది. ఆదివారం వారాంతపు సెలవు, రాజధాని (హైదరాబాద్) నగరంలో బోనాల పండుగ ఉన్నా ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు వాహనాలపై తరలివచ్చారు. 26వేల మంది భక్తు లు క్షేత్ర దర్శనానికి రాగా ప్రత్యేక, దర్మదర్శన క్యూలైన్లలో రద్దీ కొనసాగింది. ఉదయం 9నుంచి 10గంటలు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం, మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.31,64,411 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎస్.వెంకట్రావు తెలిపారు. యాదగిరికొండపై హరిహరులకు నిత్యపూజలు శాస్ర్తోక్తంగా కొనసాగాయి. గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్ కుటుంబ సమేతంగా లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. కొండపైన ప్రతీవారం నిర్వహించే సంగీత సభల్లో భాగంగా మణి భార్గవి బృందం (కూచిపూడి, కృష్ణాజిల్లా) కూచిపూడి, సంకల్ప్ నృత్యవృక్ష (హైదరాబాద్) ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను ఆకట్టుకుంది.
Updated Date - Jul 21 , 2025 | 12:27 AM