మొసళ్ల అభయారణ్యానికి.. ఆదరణ కరువు
ABN, Publish Date - Aug 04 , 2025 | 11:32 PM
జైపూర్ మం డలం శివ్వారం గ్రామంలోని మొసళ్ల అభయా రణ్యం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వమైనా దృష్టిసారించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. టూరిజం స ర్క్యూట్‌లో అభివృద్ధికి గత ప్రభుత్వ హయాంలో హామీ లు ఇచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చకపోవడంతో పర్యాటకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
-పక్షిజాతులు, వణ్య ప్రాణులకు ఆవాసం
-ప్రభుత్వం దృష్టిసారించాలంటున్న పర్యావరణ ప్రేమికులు
మంచిర్యాల, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జైపూర్ మం డలం శివ్వారం గ్రామంలోని మొసళ్ల అభయా రణ్యం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వమైనా దృష్టిసారించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. టూరిజం స ర్క్యూట్‌లో అభివృద్ధికి గత ప్రభుత్వ హయాంలో హామీ లు ఇచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చకపోవడంతో పర్యాటకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జైపూర్ మండలం కుందారం నుంచి చెన్నూరు మండలంలోని బీరెల్లి వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న గోదావరి నదిలోని మడుగు (ఎల్ మడుగు) మొ సళ్లకు ఆవాసంగా ఉంది. నదితోపాటు దాని చుట్టూ ఉ న్న అటవీ ప్రాంతాన్ని అటవీశాఖ మొసళ్ల అభయార ణ్యంగా గుర్తించింది. మంచిర్యాల-పెద్దపల్లి జిల్లా మం థని మధ్యలో రెండు కొండల నడుమ విస్తరించిన గో దావరి అందాలొలుకుతూ చూపరులను ఇట్టే ఆకర్శి స్తోంది. 1978లో పుష్పకుమార్ అనే వైల్డ్ లైఫ్ నిపుణు డు ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఇక్కడి ప్రకృతి సౌంద ర్యాన్ని చూసి ముగ్దుడై అభయారణ్యం, జీవజాతులపై అధ్యయనం చేసి అప్పటి ప్రభుత్వానికి నివేదికలు అం దజేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని మొసళ్ల పున రావాస కేంద్రంగా పిలుస్తున్నారు. ఎల్ మడుగులో 50 కి పైగా ఉప్పు, మంచినీటి మొసళ్లు ఉండగా, అటవీ శాఖ ఆధ్వర్యంలో సంక్షణ చర్యలు చేపడుతున్నారు.
ఉట్టి పడుతున్న పూర్వవైభవం...
పురాతనమైన ఈ మొసళ్ల అభయారణ్యానికి కాక తీయ రాజులు వరంగల్ నుంచి పెద్దపల్లి జిల్లా మీదు గా శివ్వారం వరకు దారి ఏర్పాటు చేసినట్లు చరిత్ర కారులు చెబుతుంటారు. అప్పట్లో మునీశ్వరులు కూడా నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఆనవాళ్లు ప్రస్తుతానికీ పదిలంగా ఉన్నాయి. జైపూర్ మండలం కేంద్రం నుంచి 28 కిలోమీటర్ల దూరంలో శివ్వారం మొసళ్ల అభయార ణ్యం ఉంది. ఎల్ మడుగు ఒడ్డున ఉన్న ఓ గుహ దాదాపు 250 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇవి మానవ నిర్మిత గహలు. ఇందులోని ఒక గుహలో ఇసు క రాతితో చెక్కిన ఎత్తయిన పానపట్టంతో శివ లింగం ఉంది. ఇక్కడ కనిపించే నాలుగు గుహాలయాలు బయ టకు ద్వార స్తంభాలుగా, లోపల రాతి గద్దె లతో నిర్మిం చిన దేవాలయాలను తలపిస్తుండగా, దీపాల గూడుల తో, మలుపు తిరిగిన రాతి గోడలతో చదునైన రాతి నేతలతో బౌద్దుల ’వస్సావాసా’ (వర్షాకాలంలో బౌద్ద భి క్షువులు నివసించే తాత్కాలిక ఆవాసాలు)ను తలపి స్తాయి. గుహలున్న ప్రదేశంలోనే లభించిన ముతక ఇటుకలు శాతవాహన కాలానికి చెందినవని చరిత్రకా రులు చెబుతున్నారు. ఒక ద్వారం పక్కన గుర్రం మీద స్వారీ చేస్తున్న జంట శిల్పం కను విందు చేస్తుంది. ద్వార స్తంభాల మీద పెట్టిన బ్రాకెట్లు, స్తంభాల శిల్పం పురాతన శైలిని ప్రతిబింబిస్తోంది. గుహల బయట కనిపిస్తున్న ప్రదేశంలో చక్కగా చెక్కిన రాతి స్తంబాలు, రాతి ఇటుకలు, రాతి గడీలు పరిచి ఉన్నాయి. గుహలు, గుహల బయట చక్కని ప్రణాళికతో నిర్మించిన నివాసా లు, ఆరామాలు కనిపిస్తున్నాయి. ఈ నాలుగు గుహలు క్రీ.పూ. 1,2 శతాబ్ధాల వాటివని చరిత్రకారులు అభి ప్రాయ పడుతుంటారు.
వణ్య సంపదకూ నిలయం...
మొసళ్ల అభయారణ్యం ఎన్నో రకాల అటవీ సంపద కు నిలయం. ఇక్కడ ఎన్నో వృక్ష, పక్షి, జంతుజాతులు ఉన్నాయి. చుక్కల దుప్పులు, నీలుగాయిలు, నీటి పి ల్లులు, అడవిపందులు, ముళ్ల పందులు, జింకలు, కొం డ గొర్రెలు, నీటి కుక్కలు వంటి జంతుజాతులు ఇక్కడ నివసిస్తున్నాయి. నెమళ్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్న ట్లు అధికారులు చెబుతున్నారు. వృక్ష సంపదలో నల్ల మద్ది, చెన్నెంగ, బూరుగు, అందుగు, కొడిశ, పాలవంటి అరుదైన వృక్షజాతులు ఉన్నాయి. యేటా ఇక్కడకు పె ద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ఎండాకాలం కూ డా ఇక్కడ నీరు ఎండిపోకుండా ఉండటంతో చాలా మంది కుటుంబాలతో కలిసి సందర్శిస్తుంటారు. పర్యా టకులు నదిలో షికారు చేసేందుకు బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం అది పనిచేయడం లే దు. అయితే ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కనుల విందు చేసే పర్యాటక ప్రాంతం ప్రస్తుతం ఆలనా పాలనలేక కళావి హీనంగా దర్శనమిస్తోంది. టూరిజం సర్య్కూట్‌లో భా గంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోకపోవడంతో ప రిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వ మైనా మొసళ్ల అభయారణ్యాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చే యాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర పర్యాటక శాఖా మం త్రి జూపల్లి కృష్ణారావే జిల్లా ఇన్‌చార్జి మం త్రిగా ప్రాతి నిథ్యం వహిస్తుండగా, మరో మంత్రి గడ్డం వివేకానంద సొంత నియోజకవర్గం చెన్నూరు పరిధిలోనిది అయి నందున మంత్రులిరువురూ మొసళ్ల అభయారణ్యంపై ప్రత్యేక చొరవ తీసుకుంటారనే ఆశాభావంలో పర్యావ రణ ప్రేమికులు ఉన్నారు.
Updated Date - Aug 04 , 2025 | 11:32 PM