ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- నేరాలను నియంత్రించాలి

ABN, Publish Date - Jul 31 , 2025 | 10:51 PM

నేరాలను నియంత్రణకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు. కాగజ్‌నగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం పెండింగ్‌ సమస్యలప ఎస్‌హెచ్‌వోను అడిగి తెలుసుకున్నారు.

కాగజ్‌నగర్‌రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

కాగజ్‌నగర్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): నేరాలను నియంత్రణకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు. కాగజ్‌నగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం పెండింగ్‌ సమస్యలప ఎస్‌హెచ్‌వోను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ రామానుజం, రూరల్‌ సీఐ కుమార స్వామి, ఎస్సై సందీప్‌ సిబ్బంది ఉన్నారు.

జిల్లాలో 30 పోలీసు యాక్టు అమలు

ఆసిఫాబాద్‌, జూలై 31 (ఆంద్రజ్యోతి): శాంతిభద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రశాంతా వాతావరణ పరిస్థితులను మరింత సవ్యంగా కొనసాగించడానికి ఆగస్టు 1 నుంచి 31 వరకు జిల్లా అంతటా 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 30 పోలీసు యాక్టు అమలులో ఉన్నందున ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నా, బహిరంగ సభలు తదితర ప్రజలు గుమికూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయకూడదని చెప్పారు. నిషేధిత ఆయుధాలు, దురుద్దేశంతో నేరాలకు ఉసి గొలిపే ఎటువంటి ఆయుధాలు కలిగి ఉండొద్దని తెలిపారు. ప్రజా జనజీవనానికి ఇబ్బంది, చిరాకు కలిగించేందుకు దారి తీసే ఇబ్బందకర ప్రజా సమావేశాలు,జన సముహం, లౌడ్‌ స్పీకర్లు, డీజేలు వంటివి నిషేధమని తెలిపారు.

పోలీసులను నిర్భయంగా సంప్రదించాలి

ఆసిఫాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మహిళలు, పిల్లలపై ర్యాంగింగ్‌ ఈవ్‌టీజింగ్‌, లైంగిక వేధింపలుకు గురైనట్లయితే పోలీసులను నిర్భయంగా సంప్రదించవ్చని జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు. స్థానికంగా గురువారం ఆయన మాట్లాడారు. భరోసా కేంద్రం ద్వారా జూలై నెలలో గ్రామాల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏడు అవగాహన సదస్సులు కల్పించడంతో పాటు ఒక రేప్‌, ఒక పోక్సో కేసు, మూడు గృహాల పరిశీలించినట్లు తెలిపారు. మహిళలు, చిన్న పిల్లల రక్షణ కోసం, భరోసా సెంటర్‌లు పని చేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయ పడోద్దని ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటా మన్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థులకు ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌, ఫోక్సో చట్టం, షీ టీం, యాంటీ ఉమెన్‌ ట్రాఫికింగ్‌, భరోసా టీం తదితర సేవలపై అవగాహన కల్పించడానికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా పిల్లలు, మహిళలు వేధింపులకు గురైనట్లయితే నేరుగా పోలీసును సంప్రదించాలని చెప్పారు. వివరాలను భరోసా సెంటర్‌ 8712670561 నంబరుకు తెలియజేయాలని సూచించారు.

Updated Date - Aug 01 , 2025 | 07:31 AM