ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad-పత్తి వైపే మొగ్గు

ABN, Publish Date - Jun 20 , 2025 | 11:37 PM

ఈ ఏడాది కూడా జిల్లా రైతులు పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. దిగుబడి తగ్గి.. గిట్టుబాటు ధర లభించకున్నా పత్తి సాగును మాత్రం వదలడం లేదు. ఈ వానాకాలంలో 3.35 లక్షల ఎకరాల్లో పంట వేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

విత్తనాలు పెట్టేందుకు సిద్ధం చేస్తున్న రైతు

- జిల్లాలో 3.35 లక్షల ఎకరాల్లో వేసే అవకాశం

- ఈ ఏడాది రూ. 8,110 మద్దతు ధర

ఈ ఏడాది కూడా జిల్లా రైతులు పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. దిగుబడి తగ్గి.. గిట్టుబాటు ధర లభించకున్నా పత్తి సాగును మాత్రం వదలడం లేదు. ఈ వానాకాలంలో 3.35 లక్షల ఎకరాల్లో పంట వేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఆసిఫాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ వానాలకంలో రైతులు పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. గతేడాది వానాకాలం సీజన్‌లో 3.32 లక్షల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేశారు. ఈ ఏడాది 3.35 లక్షల ఎకరాలలో సాగు చేసెందుకు సన్నద్ధమ య్యారు. జిల్లాలో మొత్తం 4.45 లక్షల ఎకరాలలో వివిధ పంటలు వేస్తున్నారు. ఇందులో అత్యధికంగా తెల్ల బంగారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో ఏటేటా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతుం దని అధికారులు చెబుతున్నారు. వాణిజ్య పంటగా పేరొందిన పత్తి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరగనుంది. జిల్లాలో గత వానాకాలంలో 3.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా ఈసారి 3.35 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు భావిస్తున్నారు. అధికారుల అంచనాల ప్రకారం ఇంకా మూడు వేల ఎకరాలలో సాగు విస్తీర్ణం పెరగనుంది. రెండేళ్లుగా పత్తికి అశించిన విధంగా ధర కూడ లబిస్తుండడం జిల్లాలోని భూములు కూడా పత్తి సాగుకు అనుకూలంగా ఉండ డంతో పత్తి సాగు వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. గత సీజన్‌లో సీసీఐ కేంద్రాలలో పత్తికి ప్రభుత్వం క్వింటాల్‌కు 7,521 రూపాయల మద్దతు ధర కల్పించింది. ఈసారి ప్రభుత్వం మద్దతు ధరను 8,110 రూపాయలకు పెంచింది. పత్తి ఆరు తడి పంట కావడం వర్షాల అనిశ్చితి కారణంగా దిగుబడి కొంత మేర తగ్గినా ధర ఎక్కువగా ఉండడంతో కనీస పెట్టుబడి అయిన వస్తుందన్న నమ్మకంతో రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు. సాగునీటి సౌకర్యం ఉన్న చోట రైతులు వరికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 4,45,049 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవు తాయని వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. సాధారణ సాగుకు మించి పంటలు సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లాలో ఈ మేరకు అంచనాలు వేసిన అధికారులు పంటల సాగుపై గ్రామాల వారీగా పట్టికలు రూపొందిం చారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం కంటే పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. అయితే వీటిలో పత్తి 3,35,363 ఎకరాలు, వరి పంట 56,861 ఎకరాలు, కంది పంట 30,430 సాగవుతుందని అధికారులు అంచనాలు వేశారు. మొక్కజొన్న, జొ న్న, పెసర, మినుములు, సోయాబీన్‌, మిరప, వేరుశెనగ, ఆముదాలు, నువ్వులు 22,395 ఎకరాల్లో సాగవుతున్నట్లు అంచనాలు రూపొందించారు.

మండలాల వారీగా ఇలా..

జిల్లాలో 3,35,363 ఎకరాలలో రైతులు పత్తి పంటను సాగు చేయనున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలో 35,200, రెబ్బెన మండలంలో 27,125 , తిర్యాణిలో 21,000, వాంకిడిలో 35,000, కౌటాలలో 13,277 ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నారు. పెంచికల్‌పేటలో 11,938 కాగజ్‌నగర్‌లో 28,000, దహెగాంలో 24,328, చింతలమానేపల్లిలో 18,305, సిర్పూర్‌(టి)లో 14,457, బెజ్జూరులో 21,422, సిర్పూర్‌(యూ)లో 19,990, కెరమెరిలో 22,300, లింగాపూర్‌లో 19,571, జైనూరులో 23,450 ఎకరాలలో రైతులు పత్తి పంటను సాగు చేయనున్నారు.

భూములు పత్తికే అనుకూలం..

- బాబురావు, రైతు, ఆసిఫాబాద్‌

నల్లభూములు ఎక్కువగా పత్తిసాగుకే అనుకూలం. దీంతో రైతులు పత్తి పంట వైపే మొగ్గు చూపుతున్నారు. గతేడాది సీసీఐ ద్వారా పత్తికి క్వింటాల్‌కు రూ. 7.521 చెల్లించింది. ఈ ఏడాది ప్రభుత్వం సీసీఐ మద్దతు ధర రూ.8,110 గా నిర్ణయించింది. వర్షాలు అనుకూలిస్తే ఈ సారి మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం.

Updated Date - Jun 20 , 2025 | 11:37 PM