ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhadrachalam Temple: భద్రాద్రి రామయ్య చిత్రాలకు కాపీరైట్‌

ABN, Publish Date - May 24 , 2025 | 04:07 AM

తెలుగువారి ఆరాధ్య దైవమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి చిత్రాలు, ఫొటోలను విక్రయించి సొమ్ముచేసుకునేందుకు ఇకపై చట్టపరమైన ఆటంకాలు ఎదురుకానున్నాయి.

  • వినియోగంపై హక్కులు పొందిన దేవస్థానం

  • జూన్‌ 20 తర్వాత విక్రయిస్తే కఠిన చర్యలు

భద్రాచలం, మే 23(ఆంధ్రజ్యోతి): తెలుగువారి ఆరాధ్య దైవమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి చిత్రాలు, ఫొటోలను విక్రయించి సొమ్ముచేసుకునేందుకు ఇకపై చట్టపరమైన ఆటంకాలు ఎదురుకానున్నాయి. సీతారామచంద్రస్వామి మూలమూర్తులు, చిత్రాలపై సర్వహక్కులు ఇక నుంచి భద్రాది దేవస్థానానికి ఉండనున్నాయి. ఈ మేరకు భద్రాద్రి దేవస్థానం మూలవరుల చిత్రాలు, ఫొటోలపై కాపీరైట్‌ హక్కులను అధికారికంగా పొందింది.


ఈ క్రమంలో దేవస్థానం కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడే ముద్రణదారులు, వ్యాపారులు, వారికి సహకరించే వారిపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని రావ్‌ అండ్‌ రావ్‌ ట్రేడ్‌ మార్క్‌, పేటెంట్‌, డిజైన్‌ కాపీరైట్‌ రిజిస్ట్రేషన్‌ కన్సల్టెంట్స్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తమ ఆధీనంలో ఉన్న చిత్రాలు, ఫొటోలను సదరు ముద్రణ సంస్థల నిర్వాహకులు, వ్యాపారులు జూన్‌ 20తర్వాత విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, జైలుశిక్ష తప్పదని స్పష్టం చేశారు.

Updated Date - May 24 , 2025 | 04:07 AM