ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sand Loading: డంపింగ్‌ కాంట్రాక్టర్ల అవకతవకలు

ABN, Publish Date - Feb 09 , 2025 | 04:27 AM

డంపింగ్‌ టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇసుక అదనపు లోడింగ్‌ చేస్తూ అవకతవకలకు పాల్పడుతూ ప్రతి రోజూ ప్రభుత్వానికి రూ.2.30 కోట్ల మేర నష్టం కలిగిస్తున్నారని తెలంగాణ లారీ యజమానుల సంఘం ఫిర్యాదు చేసింది.

  • రోజూ ప్రభుత్వానికి రూ.2.30 కోట్ల నష్టం

  • లారీ యజమానుల సంఘం ఫిర్యాదు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): డంపింగ్‌ టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇసుక అదనపు లోడింగ్‌ చేస్తూ అవకతవకలకు పాల్పడుతూ ప్రతి రోజూ ప్రభుత్వానికి రూ.2.30 కోట్ల మేర నష్టం కలిగిస్తున్నారని తెలంగాణ లారీ యజమానుల సంఘం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్యకార్యదర్శికి శనివారం లేఖ రాసింది. 14 చక్రాల లారీ 32 టన్ను లు, 16 చక్రాల లారీ 35 టన్నుల ఇసుక కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకుని, క్వారీల వద్దకు వెళుతున్నాయని తెలిపింది.


కానీ అక్కడికి వెళ్లిన తర్వాత డంపింగ్‌ కాంట్రాక్టర్లు లోడింగ్‌కు ఒక్కో లారీ వద్ద రూ.2,500 మేర వసూలు చేస్తున్నారని ఆరోపించింది. ఒక్కో లారీ వద్ద నుంచి అదనంగా రూ.12 వేల చొప్పున బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ అదనంగా 28-30 టన్నుల ఇసుకను లోడ్‌ చేస్తున్నారని తెలిపింది. ఇలా ప్రతి రోజూ ప్రభుత్వ ఖజానాకు రూ. 2.30 కోట్ల మేర తూట్లు పొడుస్తున్నారని తెలిపింది. ఈ దృష్ట్యా కాం ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆ సంఘం కోరింది.

Updated Date - Feb 09 , 2025 | 04:27 AM