ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా చేపట్టాలి
ABN, Publish Date - Jun 01 , 2025 | 11:20 PM
మండలంలో మంజూరు అయిన లబ్ధిదారులు వెంటనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. పట్టణంలోని ఎస్‌పీఆర్ గార్డెన్స్‌లో ఆది వారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప త్రాల పంపిణీలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.
లక్షెట్టిపేట, జూన్ 1(ఆంధ్రజ్యోతి): మండలంలో మంజూరు అయిన లబ్ధిదారులు వెంటనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. పట్టణంలోని ఎస్‌పీఆర్ గార్డెన్స్‌లో ఆది వారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప త్రాల పంపిణీలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల విడతల వారిగా అర్హులైన ప్రతీ ఒక్కరికి మంజూరు అవుతాయని ఎవరూ నిరాశ చెందకూడదన్నారు. ఎవరికీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వకూడ దన్నారు. అనంతరం లబ్ధిదా రులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను అందజే సారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో సరోజ, మార్కెట్ క మిటీ వైస్ చైర్మన్ ఆరీఫ్, పార్టీ మండల అద్యక్షుడు పిం గిళి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్, పూర్ణ చం దర్‌రావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, ఆర్టీఏ డైరెక్టర్ అంకతి శ్రీనివాస్, నాయకులు తొట రమేష్, ముత్తె సుధాకర్, కందుల మోహన్ పాల్గొన్నారు.
కుల మతాలకు అతీతంగా
ప్రభుత్వ సంక్షేమ పథకాలు
దండేపల్లి: కుల, మతాలకు అతీతంగా కాంగ్రెస్ ప్ర భుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. ఆదివా రం దండేపల్లి మండలం మేదరి పేటలో ఇందిరమ్మ ఇ ళ్ల, రాజీవ్ యువ వికాసం మంజూరు పత్రాలను లబ్ధి దారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశా నికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోందన్నారు. భూ సమస్య పరిష్కా రానికి ప్రతీ గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చే స్తోందన్నారు. మండలంలో అర్హులైన 600 మందికి పై గా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజారు చేశామ న్నారు. కడెం ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకం ద్వా రా నియోజకవర్గంలోని ఆయకట్టు భూములకు రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నప్పటికీ గోదావరి బెల్ట్ ప్రాంత భూములను సస్యశ్యామలం చేయడానికి త్వర లో మండలంలోని గుడిరేవు, ద్వారక లక్షెట్టిపేటలో మో దెల గ్రామాలోని ఎత్తిపోతల పథక నిర్మాణానికి నిధు లు మంజూరు చేసి నిర్మాణ పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ దాసరి ప్రేమ్ చందు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సవఘటన్ జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు వెంక టేశ్వర్లు, సతీష్, తహసీల్దార్ రోహిత్ దేశ పాండే, ఎంపీ డీవో ప్రసాద్, మాజీ జడ్పీ వైస్ ఛైర్మపర్సన్ ప్రవీణ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, కాంతరావు, ఎంపీవో విజయప్రసాద్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ పాల్గొన్నారు.
ఫదండేపల్లి శివారులో సాగునీటి కాలువతో ప్రమాద శాత్తు ఆటో ట్రాలీ బోల్తా పడిన ప్రమాదంలో గాయపడి న దండేపల్లి చెందిన నలుగురు ఉపాధి కూలీలకు ప్రభు త్వం నుంచి మంజూరైన ఎక్స్‌గ్రేషియా చెక్కులను ఎమ్మె ల్యే ప్రేమ్‌సాగర్‌రావు అందజేశారు. గత ఎడాది మే 17న పని ము గించుకుని ఇంటికి ఆటో ట్రాలీలో వస్తుండగా సాటునీటి కాలువలో పడి గాయపడిన వేమునూరి కమ లకు రూ. 1,18,819, గొప హేమకు రూ 67, 499, ఎన గందుల స్వప్పకు రూ. 32,558, బొమ్మెన సుజాతకు రూ. 56, 755 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశా రు. దండేపల్లి మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, పార్టీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jun 01 , 2025 | 11:20 PM