ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌

ABN, Publish Date - Apr 21 , 2025 | 11:50 PM

రాజ్యాంగ నిర్మాత, బీఆర్‌ అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఆది నుంచి అడుగ డుగునా అవమానించిందని ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్‌చార్జి, ఎంపీ మునిస్వామి అన్నారు.

జిల్లా సదస్సులో మాట్లాడుతున్న ఎస్సీ మోర్చా ఇన్‌చార్జి, మాజీ ఎంపీ మునిస్వామి

ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్‌చార్జి, మాజీ ఎంపీ మునిస్వామి

నారాయణపేట టౌన్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : రాజ్యాంగ నిర్మాత, బీఆర్‌ అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఆది నుంచి అడుగ డుగునా అవమానించిందని ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్‌చార్జి, ఎంపీ మునిస్వామి అన్నారు. కానీ ఆయనను బీజేపీ అభిమానించి, ఆరాఽధిస్తున్నదన్నారు. అంబేడ్కర్‌ జయంతి వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు ఆయనతో పాటు, బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు నాగురావు నామాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మునిస్వామి మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయాలను నేరవేరుస్తున్నది కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనన్నారు. అంబేడ్కర్‌ను రాజ్యాంగ కమిటీ నియమించడం నె హ్రూకు ఇష్టం లేదని గుర్తు చేశారు. 60 ఏళ్ల పాలనలో అంబేడ్కర్‌కు భారత రత్న ఇవ్వ కుండా అవమానించింది కాంగ్రెస్‌ పార్టీయే అన్నారు. 108 సార్లు రాజ్యాంగానికి సవరణలు తీసుకొచ్చి ఎమర్జెన్సీ, రాష్ట్రపతి పాలనకు ఉప యోగించుకుందని విమర్శించారు. కానీ బీజే పీ ప్రజా శ్రేయస్సు కోసం కొన్ని సవరణలు మాత్రమే చేసిందన్నారు. ప్రజలకు మరింత చేరువై రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. ప్రతీ గ్రామంలో ఎస్సీ వాడల్లో పార్టీ ముఖ్య నాయకులు, బూత్‌ కమిటీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పటిష్టానికి కావల్సిన అంశాలను చర్చించాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు బి.కొండయ్య, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పి బాషా, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌.విజయ్‌కు మార్‌, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణ, నర్సన్‌ గౌడ్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మికాంతరెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి సుజాత, బీజేపీ పట్టణ అధ్యక్షుడు పోషల్‌ వినోద్‌, మండల అధ్యక్షురాలు జ్యోతి సాయిబన్న, నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:50 PM