ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కౌలు వేలం రద్దుతో గందరగోళం

ABN, Publish Date - Jul 01 , 2025 | 12:44 AM

మండలంలోని మిర్యాల గ్రామ సీతారామచంద్ర స్వామి దేవాలయ భూముల కౌలు వేలం రద్దు చేయాలని కలెక్టర్‌ నిర్ణయం తీసుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

మొలకెత్తిన పత్తి మొక్కలు

మిర్యాల దేవాలయ భూముల కౌలు వేలం రద్దు చేయాలని కలెక్టర్‌ నిర్ణయం

నూతనకల్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మిర్యాల గ్రామ సీతారామచంద్ర స్వామి దేవాలయ భూముల కౌలు వేలం రద్దు చేయాలని కలెక్టర్‌ నిర్ణయం తీసుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత ఏప్రిల్‌ 4వ తేదీన అధికారుల సమక్షంలో సుమారు 103 ఎకరాలకు కౌలు వేలం నిర్వహించగా అదే గ్రామానికి చెందిన రైతు దరిపెల్లి వెంకన్న రూ.5లక్షలకు దక్కించుకున్నాడు. ఆ డబ్బులను ఎండోమెంట్‌ అధికారులకు చెల్లించాడు. అనంతరం జరిగిన శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కౌలు భూమిలో కొంతభూమి సాగుకు అనుకూలంగా ఉండగా, కొంత భూమి బీడుగా ఉంది. బీడు భూములను జీవాలకు మేతకు, సాగు భూమిని వెంకన్న కొంత తన స్వాధీనంలో ఉంచుకుని, మిగతా కొంత భూమిని గ్రామానికి చెందిన రైతులకు కౌలుకు ఇచ్చాడు. సాగుకు అనుకూలంగా ఉన్న భూముల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. పత్తి గింజలు మొలకెత్తాయి. రైతులు ఇప్పటికే రూ.లక్షల పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు అనుకోకుండా కలెక్టర్‌ దేవాలయ భూముల కౌలు వేలం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఏమైన పొరపాట్లు ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి కాని, తమకు అన్యాయం చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేయాలని కౌలు వారు కోరుతున్నారు. ఈ విషయమై ఎండోమెంట్‌ అధికారి కుశలయ్యను వివరణ కోరగా గతంలో కంటే కౌలు వేలం తక్కువగా వచ్చినందున కలెక్టర్‌ ఆదేశాల మేరకు తిరిగి కౌలు వేలం నిర్వహిస్తున్నామన్నారు. .

భూముల కౌలు వేలానికి సహకరించాలి

గ్రామంలోని సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల కౌలు వేలానికి గ్రామస్థులు సహకరించాలని తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు కోరారు. సోమవారం గ్రామంలో ఎండోమెంట్‌, పోలీస్‌, రెవెన్యూ అధికారులతో వేలం పాటపై అవగాహన కల్పించారు. గతంలో కంటే ఈసారి తక్కువగా కౌలు వేలం పాడినందున కలెక్టర్‌ తిరిగి కౌలు వేలం పాట నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. జూలై 4న కౌలు బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సీఐ నర్సింహారావు, ఎస్‌ఐ ప్రవీన్‌కుమార్‌, ఎండోమెంట్‌ అధికారి కుశలయ్య, ఆర్‌ఐ హసన్‌, ఎంపీవో శశికళ తదితరులు ఉన్నారు. తమకు నష్టపరిహారం చెల్లించి తిరిగి వేలం పాట నిర్వహించాలని సీతారామచంద్రస్వామి దేవాలయ భూములను కౌలుకు తీసుకున్న రైతులు తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావుకు వినతి అందజేశారు.

నిబంధనల మేరకే కౌలుకు తీసుకున్నాను

ఎండోమెంట్‌ అదికారుల నిబంధనల మేరకే దేవాలయ భూములను కౌలుకు తీసుకున్నాను. రూ.5లక్షలకు వేలం డబ్బులు చెల్లించా. కొంత భూమిని ఉంచుకుని కొంత భూమిని మరికొంత మంది రైతులకు ఇచ్చాను. బీడు భూములను యాదవులకు జీవాల మేతకు ఇచ్చాను. వారందరూ నాకు డబ్బులు చెల్లించారు.

ఫ దరిపెల్లి వెంకన్న, కౌలు రైతు

Updated Date - Jul 01 , 2025 | 12:44 AM