బాలుడి మృతిపై ఆందోళన
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:41 AM
వైద్యుడి నిర్లక్ష్యం తోనే బాలుడి మృతిచెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యు లు సంబంధిత ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు.
సూర్యాపేటక్రైం, జూన్ 29, (ఆంధ్రజ్యోతి): వైద్యుడి నిర్లక్ష్యం తోనే బాలుడి మృతిచెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యు లు సంబంధిత ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలంలోని గుడిత ండాకు చెందిన జాటోత్ జలంధర్-మనీషా దంపతులకు మొదటి సంతానంగా మూడు నెలల క్రితం బాలుడు జన్మించాడు. నాలుగు రోజుల క్రితం బాలుడికి వాంతులు చేసుకోవడం, జ్వరం రావ డంతో చికిత్సనిమిత్తం సూర్యాపేటలోని ప్రైమ్ చిన్న పిల్లల ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. రెండు రోజులు బాలుడు మంచిగానే ఉన్నప్పటికి మూడో రోజు నుంచి బాలుడి ఆరోగ్యం బాగాలేదని తల్లిదండ్రులు వైద్యుడికి తెలిపినా పట్టించుకోలేదని కుటుంబసభ్యులు తెలిపారు. తీరా బాలుడి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం, హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యు డు సూచించాడు. బాలుడిని చికిత్సకోసం ఖమ్మం ఆదివారం తీసుకెళ్లగా అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు బాలుడి పరిస్థితి విషమంగా ఉందని చికిత్స చేశారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో సూర్యాపేటలోని ఆస్పత్రిలో చికిత్స చేసిన వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందివారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.
ఆస్పత్రి నిర్వాహకులు పట్టించుకోవడంలేదని..
న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్నా ఆస్పత్రి నిర్వా హకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆగ్రహం చెందిన ఆందోళనకారులు ఆస్పత్రి అద్దాలు పగలగొట్టారు. బాధితుల కుటు ంబ సభ్యులు, బంధుమిత్రులు భారీగా తరలిరావడంతో పరిస్థితి చేదాటిపోయింది. ఆందోళనచేస్తున్న వారిని పోలీసులు చెదర గొట్టారు. ఆందోళనకారులు పక్కనే ఉన్న రాళ్లను ఆస్పత్రిపైకి రువ్వారు. దీంతో అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ గుగులోత్ నరేష్ తలకు తీవ్రగాయమైంది. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా న్యాయం చేయాలని కోరుతున్నా తమపై పోలీసులు లాఠీచార్జీ చేయడం ఏ మిటని బాధిత సమీప బంధువు మహేందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు. గమ నించిన పోలీసులు వెంటనే అతడిపై నీళ్లు పోసి అడ్డుకున్నారు.
ఆస్పత్రికి చేరుకున్న పోలీసు అధికారులు
డీఎస్పీ ప్రసన్నకుమార్, సూర్యాపేట ఇన్‌చార్జి సీఐ రాజశేఖర్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. జరిగిన విషయంపై బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. సామరస్యంగా మాట్లాడుకో వాలని ఆస్పత్రి నిర్వాహకులకు చెప్పారు. ఫిర్యాదు చేస్తే చట్టప రంగా చర్యలు తీసుకుంటామని, అంతేకానీ ఆందోళనలు చేయడం, ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేయడం, రాళ్లు రువ్వడం చేస్తే చర్యలు తప్పవని తెలిపారు. దీంతో ఆందోళనకారులు ఆందోళనను విరమించి ఆస్పత్రి నిర్వహకులతో జరిగిన విషయమై చర్చించారు.
Updated Date - Jun 30 , 2025 | 12:41 AM