ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం రూ.5వేల కోట్లు కేటాయించాలి

ABN, Publish Date - May 17 , 2025 | 11:16 PM

సీఎం రూ.5వేల కోట్లు కేటాయించాలి CM should allocate Rs. 5 thousand crores

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌

- మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌

కల్వకుర్తి, మే 17 (ఆంధ్రజ్యోతి) : రాజకీ యంగా గుర్తింపునిచ్చిన కన్న తల్లిలాంటి కల్వకు ర్తి సమగ్ర అభివృద్ధికి సీఎంరేవంత్‌రెడ్డి రూ.5వేల కోట్లు కేటాయించాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. కల్వ కుర్తి పట్టణంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైపా ల్‌ యాదవ్‌ మాట్లాడారు. కల్వకుర్తిలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ సం దర్భంగా గతంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్య త ఇస్తానని, కల్వకుర్తికి ఇద్దరం ఎమ్మెల్యేలమని అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కల్వకుర్తికి మెడికల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలను మంజూరు చేయాలని కోరారు. అచ్చంపేట నియోజకవర్గ పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి కల్వకుర్తి అభి వృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఎడ్మ సత్యం, మాజీ వైస్‌ చైర్మన్‌ షాహిద్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సింగం విజయ్‌ గౌడ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ కొండూరు గోవర్ధన్‌, మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ దశరథ నాయక్‌, నాయకులు సూర్య ప్రకాష్‌రావు, మనోహర్‌రెడ్డి, ఎముక జంగయ్య, వెంకటేశ్వరరావు, శ్రీనివా సులు, రుక్కయ్య, చిన్న ఉన్నారు.

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌ అన్నారు. కల్వకుర్తి మండల పరిధిలోని మార్చా ల గ్రామంలో ప్రీమియర్‌ లీగ్‌-4క్రికెట్‌ టోర్న మెంట్‌ శనివారం ముగిశాయి. విజేతలకు మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌ కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌ బహు మతులను ప్రదానం చేశారు.

పోచమ్మ గుడికి ఆర్థిక సహాయం

కల్వకుర్తి మండలం తర్నికల్‌ గ్రామంలో ని ర్మించే పోచమ్మ గుడి నిర్మాణానికి మాజీ ఎమ్మె ల్యే గుర్క జైపాల్‌యాదవ్‌ రూ.25వేల ఆర్థిక సహాయం అందజేశారు.

Updated Date - May 17 , 2025 | 11:16 PM