CM Revanth Reddy: మొగిలిగిద్ద పాఠశాల 150వ వార్షికోత్సవం
ABN, Publish Date - Jan 28 , 2025 | 03:44 AM
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్ద ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 31న రాబోతున్నారని అఖిల భారత విద్యా హక్కు వేదిక అధ్యక్షవర్గ సభ్యుడు
31న సీఎం రేవంత్‌రెడ్డి రాక
పూర్వ విద్యార్థులు తరలిరావాలి: ప్రొఫెసర్ జి. హరగోపాల్
షాద్‌నగర్ అర్బన్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్ద ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 31న రాబోతున్నారని అఖిల భారత విద్యా హక్కు వేదిక అధ్యక్షవర్గ సభ్యుడు, ప్రొఫెసర్ జి.హరగోపాల్ తెలిపారు. షాద్‌నగర్ విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో మొగిలిగిద్ద పాఠశాల పూర్వ విద్యార్థులతో కలిసి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాల వార్షికోత్సవాన్ని పండగలా నిర్వహిద్దామన్నారు.
మాజీ ముఖ్యమంత్రులు దివంగత బూర్గుల రామకృష్ణారావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డితో పాటు తనవంటి వారు ఎందరో మొగిలిగిద్ద పాఠశాలలో చదివి గొప్ప స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కుటుంబసభ్యులతో కలిసి తరలిరావాలని పిలుపునిచ్చారు. పాఠశాలను అభివృద్ధి చేయాలని సీఎంను కోరామని, దీంతో కలెక్టర్‌ను గ్రామానికి పంపించి ప్రతిపాదనలు తీసుకున్నారని తెలిపారు. సమావేశంలో పాలమూరు అఽధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, ప్రొఫెసర్ వనమాల, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Jan 28 , 2025 | 03:44 AM