ప్రమాదాలకు చెక్
ABN, Publish Date - Apr 25 , 2025 | 12:21 AM
హైదరాబాద్- విజయవాడ(65)వ నెంబర్ జాతీయ రహదారిపై నిత్యం జరిగే ప్రమాదాలకు అడ్డుకట్ట పడనుంది.
ముకుందాపురం బ్లాక్ స్పాట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం
ఫ్లైఓవర్‌కు రూ.25 కోట్లు
అండర్‌పాస్‌కు రూ.5కోట్లు
కోదాడరూరల్, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్- విజయవాడ(65)వ నెంబర్ జాతీయ రహదారిపై నిత్యం జరిగే ప్రమాదాలకు అడ్డుకట్ట పడనుంది. ఇందుకోసం బ్లాక్‌స్పాట్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం మొదలుపెట్టారు. ప్ర మాదాల నివారణకు గత ప్రభుత్వం జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయాలని జాతీయ రహదారి అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. హైదరాబాద్, చౌటుప్పల్ నుంచి ఆంధ్ర సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్డు వరకు మొత్తం 13ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరుచేసింది. ఒక్కో ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.25కోట్లు, అండర్‌పాస్ నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరయ్యాయి. దీంతో కోదాడ నియోజకవర్గ పరిధిలో ముకుందాపురం, ఆకుపాముల గ్రామాల వద్ద అండర్ పాస్, రామాపురం క్రాస్‌రోడ్డు, కొమరబండ గ్రామాల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులు దక్కించుకున్న సంబంధిత కాంట్రాక్టర్లు ఫ్లైౖఓవర్లు నిర్మించేందుకు వాహనాల రాకపోకలకు వీలుగా సర్వీ్‌స రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. రామాపురం క్రా్‌సరోడ్డు వద్ద ఉన్న సర్వీ్‌సరోడ్డును మరింత వెడల్పు చేసేందుకు రోడ్డు పక్కన ఉన్న హోటళ్లు, బడ్డీకొట్లు, షాపులను తొలగించారు. అక్కడ ఉన్నసర్వీస్ రోడ్డును మూడు వాహనాలు వెళ్లే విధంగా రోడ్డును వెడల్పు చేస్తున్నారు. కొమరబండ గ్రామం వద్ద ఇప్పటికే ఫ్లైఓవర్ నిర్మిస్తుండడంతో ఇరువైపులా వాహనాలు వెళ్లేందుకు సర్వీ్‌స రోడ్లు నిర్మిస్తున్నారు. 15 రోజుల్లో సర్వీ్‌స రోడ్లు పూర్తిచేసి వచ్చే నెలలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
Updated Date - Apr 25 , 2025 | 12:21 AM