ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- ఎర్తింగ్‌తో విద్యుత్‌ ప్రమాదాలకు చెక్‌

ABN, Publish Date - Jul 20 , 2025 | 11:11 PM

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్లు కట్టుకుంటారు. విద్యుత్‌ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ విద్యుత్‌ ప్రమాదాల నివారణ చర్యలను ఎవరు పెద్దగా పట్టించుకోరు. తద్వారా ఏదైనా ప్రమాదం సంభవిస్తే కోట్ల రూపాయల ఆస్తితో పాటు ప్రాణ నష్టం జరుగుతుంది. అందువల్ల ఇళ్లు, షాపులు, అపార్టుమెంట్‌ భవనమైన నిర్మించే సందర్భంలో తగిన సామర్థ్యంతో ఎర్తింగ్‌ ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు.

పైప్‌ ఎర్తింగ్‌

కౌటాల, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్లు కట్టుకుంటారు. విద్యుత్‌ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ విద్యుత్‌ ప్రమాదాల నివారణ చర్యలను ఎవరు పెద్దగా పట్టించుకోరు. తద్వారా ఏదైనా ప్రమాదం సంభవిస్తే కోట్ల రూపాయల ఆస్తితో పాటు ప్రాణ నష్టం జరుగుతుంది. అందువల్ల ఇళ్లు, షాపులు, అపార్టుమెంట్‌ భవనమైన నిర్మించే సందర్భంలో తగిన సామర్థ్యంతో ఎర్తింగ్‌ ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ ప్రమాదాల తీవ్రత తగ్గించేందుకు ప్రతి భవనానికి ఎర్తింగ్‌ తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. విద్యుత్‌ ఎర్తింగ్‌ ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి. అవి పైప్‌ ఎర్తింగ్‌, ప్లేట్‌ ఎర్తింగ్‌, స్టిఫ్‌ ఎర్తింగ్‌ వీటితో పాటు న్యూట్రల్‌ ఎర్తింగ్‌ కూడా ఉంటుంది. జిల్లాలో ఎక్కువగా భవనాలకు ఎర్తింగ్‌ ప్లాంట్లు లేవని విద్యుత్‌ శాఖాధికారులు చెబుతున్నారు. ఇళ్లలో వినిఓగించే విద్యుత్‌ సామర్థ్యం ఆధారంగా ఎర్తింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలని, ఎలక్ట్రికల్‌ సర్క్యూట్లను భూమికి అనుబంధానం చేస్తూ పైప్‌, ప్లేట్‌ ఎర్తింగ్‌తో భవనాల్లో ఎర్తింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసుకుంటే విద్యుత్‌ ప్రమాదాలను చాలా వరకు నివారించవ్చని సూచిస్తున్నారు. పరిశ్రమలతో పాటు అపార్లుమెంట్లలో విద్యుత్‌ వైరింగ్‌ వ్యవస్థలో లోపాలను పరిశీలించేందుకు విద్యుత్‌ తనిఖీ విభాగం ఉన్నా గృహాలు, షాపుల్లో ఎలక్ట్రీకల్‌ ప్రమాదాల నివారణకు ఎలాంటి ప్రత్యేక వ్యవస్థ లేదని, దీంతో తరుచూ షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయని, సెంట్రల్‌ ఎలక్ట్రీసిటీ అథారిటీ నిబంధనల ప్రకారం కనీసం అయిదేళ్లకోసారి గృహాల్లో వైరింగ్‌ను తనిఖీ లేదా మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సింగిల్‌ ఫేజ్‌, న్యూట్రల్‌ వైర్లు సమాన పరిమాణంలో ఉండేలా చూసుకోవాలంటున్నారు.

- ఎంసీబీ, ఆర్‌సీసీబీలు..

కరెంటు సరఫరాలో లీకేజీలను అరికట్టేందుకు ఎంసీబీ(మినియేచర్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌) ప్రతి ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. రెండు ఫేజ్‌లు కలిసినప్పుడు ఓల్టేజీలో హెచ్చుతగ్గులు తలెత్తినప్పుడు ఎంసీబీ వెంటనే ట్రిప్పయి కరెంటు సరఫరా నిలిచి పోతుంది. ఇళ్లలో మెట్రో కరెంటు ఇన్‌స్టలేషన్‌ లీకేజీలను అరికట్టేందుకు ఆర్‌సీసీబీ(రెడ్యువల్‌ కరెంటు సర్క్యూట్‌ బ్రేకర్‌) ఏర్పాటు చేసుకోవాలి. చాలా ఇళ్లలో ఆర్‌సీసీబీలు ఏర్పాటు చేసుకోవడం లేదు. ఆర్‌సీసీబీ ఏర్పాటు చేసుకుంటే షార్ట్‌ సర్క్యూట్‌ అయితే వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిచి పోతుంది. రెండేళ్లకోసారి ఇళ్లలో వైరింగ్‌ సామర్థ్యాన్ని తనిఖీ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

- పైప్‌ ఎర్తింగ్‌:

పైప్‌ ఎర్తింగ్‌ కోసం 38 మిల్లీమీటర్ల వ్యాసం, రెండు మీటర్ల పొడవు గల పైపును సాధారణంగా ఉపయోగిస్తారు. దీనిని 2-3 మీటర్ల లోతులో భూమిలో పాతిపెడతారు. పైపు చుట్టు బొగ్గు, ఉప్పు వేసి తేమను నిలపుకోవడం ద్వారా ఎర్త్‌ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తారు. పైప్‌ ఎర్తింగ్‌ ఇంటి విద్యుత్‌ వ్యవస్థలు, పారిశ్రామిక విద్యుత్‌ వ్వవస్థలు, ట్రాన్స్‌మిషన్‌ టవర్ల వంటి వివిధ అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. ఇది ముఖ్యంగా తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలకు తేమ తక్కువగా ఉన్న ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. విద్యుత్‌ షాక్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

- స్ట్రీప్‌ ఎర్తింగ్‌..

స్ట్రిప్‌ ఎర్తింగ్‌ అనేది తక్కువ నిరోధకత కలిగిన మెటాలిక్‌ స్ట్రిప్‌ ద్వారా విద్యుత్‌ ఉపకరణాల నుంచి భూమికి విద్యుత్‌ను ప్రసారం చేసే ప్రక్రియ. ఈ ఎర్తింగ్‌ కోసం గాల్వనైజ్డ్‌ స్టీల్‌ లేదా కాపర్‌ స్ట్రిప్స్‌లను ఉపయోగిస్తారు. విద్యుత్‌ ఉపకరణంలో ఏదైనా లోపం సంభవించినప్పుడు అధిక విద్యుత్‌ ప్రవాహం ఎర్తింగ్‌ సిస్టమ్‌లోకి వెళుతుంది. ఈ స్ట్రిప్‌ ఎర్తింగ్‌ ద్వారా విద్యుత్‌ ప్రవాహం భూమికిలోకి సురక్షితంగా ప్రవహించి విద్యుత్‌ షాక్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్ట్రిప్‌ ఎర్తింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యమని విద్యుత్‌ అధికారులు సూచిస్తున్నారు.

ప్లేట్‌ ఎర్తింగ్‌..

ఈ ప్లేట్‌ ఎర్తింగ్‌ పద్ధతిలో (60-60 సెంటీమీటర్లు) కొలతలు కలిగిన ప్లేటును 60 సెంటీమీటర్ల లోతులో భూమిలో పాతిపెడతారు. దీనిలో 6.3 మిల్లీమీటర్ల లేదా 3.15 మందం గల గాల్వనైజ్డ్‌ స్టీల్‌ ప్లేట్‌ లేదా రాగి ప్లేట్‌ను ఉపయోగిస్తారు. ఈ ప్లేటును గుంత లోకి నిలువుగా ఉంచి దాని చుట్టు బొగ్గు, ఉప్పు వేసి ఎర్త్‌ వైర్‌ను కనెక్ట్‌ చేస్తారు. అనంతరం గుంతను మట్టితో కప్పుతారు. ఇది తుప్పు పట్టకుండా ఉంటుంది. దీని ద్వారా భూమిలోకి తక్కువ నిరోధక మార్గాన్ని అందిస్తుంది. తద్వారా విద్యుత్‌ షాక్‌ ప్రమాదాన్ని తగ్గించి విద్యుత్‌ పరికరాలను సురక్షితంగా ఉంచుతుంది.

వర్షాకాలంలో ఎక్కువ ప్రమాదాలు..

- రాజేశ్వర్‌, ఏడీఏ ఆపరేషన్‌, కౌటాల

వర్షాకాలం విద్యుత్‌ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి. పలు గృహాల్లో ఏసీలు, గీజర్లు ఏర్పాటు చేసుకుంటున్నా భవనాలకు ఎర్తింగ్‌ ఉందా లేదా అనే విషయం పట్టించుకోవడం లేదు. ఏసీలు, గీజర్లు, వాషింగ్‌ మెషిన్‌, ఫ్రిజ్‌లు ఓవెన్లు లాంటివి ఉన్న ఇంట్లో ఎర్తింగ్‌ తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఎర్తింగ్‌ ఏర్పాటు వల్ల 90 శాతం విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.

Updated Date - Jul 20 , 2025 | 11:11 PM