కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN, Publish Date - Jun 07 , 2025 | 11:23 PM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటరమణరావు అన్నారు.
బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటరమణరావు.
దండేపల్లి, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటరమణరావు అన్నారు. దండేపల్లి బీజేపీ కార్యాలయంలో జిల్లా పార్టీ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు బందెల రవిగౌడ్ అధ్యక్ష తన శనివారం నూతన కార్యవర్గ కమిటీ, మండల శక్తి కేంద్రాల కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించిన నేపఽథ్యంలో దేశ ప్ర జలు గర్విస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్ధాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అనంతరం నూ తన కార్యవర్గ కమిటీ ఆయన ప్రకటించారు. బీజేపీ మండల అధ్యక్షుడిగా బందెల రవిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా పత్తిపాక సంతోష్, అక్కల దివ్య, ముత్తె అనిల్, ఉపాధ్యక్షులుగా ఢాంకా లక్ష్మణ్, వనపర్తి రాకేష్, ఎర్రం విజ యేందర్, మిగితా కార్యవర్గం శక్తి కేంద్రాల కార్యవర్గ కమిటీని ఎన్నుకు న్నా రు. కార్యక్రమంలో మాజీ బీజేపీ మండల అధ్యక్ష కార్యదర్శులు గోపతి రాజ య్య, ఎంబడి సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ బెదుడ సురేష్, మాజీ వైస్ ఎంపీపీ చిట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Jun 07 , 2025 | 11:23 PM