ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- ప్రశాంతంగా సీఆర్టీ పరీక్ష

ABN, Publish Date - Jul 27 , 2025 | 11:04 PM

జిల్లాలో ఆదివారం నిర్వహించిన సీఆర్టీ (ఎస్‌జీటీ) పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీజీటిడబ్ల్యూయూ ఆర్‌జేసీ(పీటీజీ బాలుర), ఆశ్రమ బాలికల పాఠశాల, ఆసిఫాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్‌ పరిశీలించారు

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం నిర్వహించిన సీఆర్టీ (ఎస్‌జీటీ) పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీజీటిడబ్ల్యూయూ ఆర్‌జేసీ(పీటీజీ బాలుర), ఆశ్రమ బాలికల పాఠశాల, ఆసిఫాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన సీఆర్టీసీ ఎస్‌జీటీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థు లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించామని అన్నారు, అత్యవసర సేవల నిమిత్తం వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులు అందుబాటులో ఉంచామని అన్నారు. పారిశుధ్యం, తాగునీరు, నిరంతర విద్యుత్‌ సరఫరా, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతించామని అన్నారు, ప్రశాంత వాతావరణంలో పరీక్ష కొనసాగిందని తెలిపారు.

ముగిసిన గ్రామపాలన అధికారులు, లైసెన్స్డ్‌ సర్వేయర్ల పరీక్ష

ఆసిఫాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన గ్రామపాలన అధికారుల, లైసెన్స్డ్‌ సర్వేయర్ల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గ్రామ పాలనాధికారుల పరీక్షకు 37 మంది హాజరు కావాల్సి ఉండగా 33 మంది హాజరయ్యారు. అలాగే రెవెన్యూ విభాగంలో లైసెన్స్డ్‌ సర్వేయర్ల నియామకం కోసం రెండు సెషన్లుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షలకు 97 మంది హాజరు కావాల్సి ఉండగా 80 మంది హాజరైనట్లు పరీక్షల కన్వీనర్లు శ్రీనివాస్‌, రాందాస్‌లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సీఐ రవీందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందో బస్తు నిర్వహించారు.

Updated Date - Jul 27 , 2025 | 11:04 PM