kumaram bheem asifabad- లెక్క తేలింది
ABN, Publish Date - Jul 19 , 2025 | 11:19 PM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఒక్కో అడుగు పడు తోంది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా, మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలతో పాటు మండల ప్రజా పరిషత్ స్థానాలను ప్రకటించింది. ఈ ప్రకారం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు 127 ఉండగా, జడ్పీటీసీ, ఎంపీపీలు 15గా లెక్క తేల్చా రు. దీంతో ఎన్నికలకు ఆశావహులు సిద్ధమవుతున్నారు
- 42 శాతం రిజర్వేషన్ అమలుతో బీసీలకు పెరగనున్న అవకాశాలు
- పార్టీ టికెట్ల కోసం ఆశావహుల యత్నాలు
- నేతల దృష్టిలో పడేందుకు ఆరాటం
చింతలమానేపల్లి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఒక్కో అడుగు పడు తోంది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా, మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలతో పాటు మండల ప్రజా పరిషత్ స్థానాలను ప్రకటించింది. ఈ ప్రకారం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు 127 ఉండగా, జడ్పీటీసీ, ఎంపీపీలు 15గా లెక్క తేల్చా రు. దీంతో ఎన్నికలకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఇటీవల ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో 42శాతం బీసీలకు రిజర్వేషన్ల అమలు చేస్తామని చెప్పాడంతో ఆశావహులు పావులు కదుపుతున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇక పెద్దపీట ఉండబోతుంది. దీంతో రాజకీయ పరంగా బీసీలకు ప్రాతినిథ్యం పెరగుతోంది. బీసీ రిజర్వేషన్‌ను 42శాతానికి పెంచుతూ ఆర్టినెన్స్ జారీ చేయాలని ఇప్పటికే కేబినేట్ నిర్ణయించింది. గవర్నర్ వద్దకు ఫైల్ వెళ్లింది. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే ఆర్టినెన్స్ జారీ అవకాశం ఉంది. ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంఽ దించి ప్రత్యేక జీవోను విడుదల చేస్తారు. జీవోల పేర్కొ న్న వివరాల ప్రకారం మండల, జిల్లా, గ్రామ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాల నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల ఆశలు చిగురిస్తున్నాయి ఇప్పటికే ఆశావహులు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పావులు కదుపుతున్నారు. నోటిఫికేషన్, రిజర్వేషన్లు ఖరారు కాగానే తమ అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు సిద్దం అవుతున్నారు. బీసీలకు కేటాయించ బోయే 42శాతం రిజర్వుడ్ స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ స్థానికంగా బలమున్న బీసీ నాయకులు సత్తా చాటే అవకాశం ఉన్నది. దీంతో మెజార్టీ స్థానాల్లో బీసీల ప్రాతినిథ్యం పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేకులు అంచనా వేస్తున్నారు.
- ఏడాదిన్నర కాలంగా..
రాష్ట్ల్రంలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం గతేడాది జనవరి 31తో ముగిసింది. అప్పటి నుం చి ఆ గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. ఆ తర్వాత గతేడాది జూన్‌లోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల పదవీ కాలం కూడా ముగిసింది. ఆ తర్వాత మున్సిపాలిటీలు, మెజార్టీ ము న్సిపల్ కార్పొరేషన్‌లలోనూ పాలక వర్గాల గడువు ముగిసింది. ప్రస్తుతం స్థానిక సంస్థలన్నీ దాదాపుగా ప్రత్యేకాధికారుల పాలనలోనే నడుస్తున్నాయి. ప్రభుత్వా నికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఉద్ధేశ్యం ఉన్నప్పటికీ కులగణన బీసీ రిజర్వేషన్ల హమీ కార ణంగా ఈ ప్రక్రియలో జాప్యం జరిగింది. త్వరలోనే ఆర్టినెన్స్ ఇవ్వడంతో పాటు స్థానిక సంస్థల్లో వివిధ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఆ తర్వా త రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ఇవ్వ నుంది.
- ఇక ఎన్నికల సందడి..
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఖరారైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 15 జడ్పీటీసీలు, 15 ఎంపీపీలు స్థానా లు ఉన్నాయి. ఇందులో బీసీలకు సుమారుగా 6 చొప్పు న స్థానాలు బీసీలకు రిజర్వు అయ్యే అవకాశం ఉన్నది. ఎంపీపీలు కూడా అదే స్థాయిలో దక్కే అవకాశం ఉన్నది. గతంలో ఎంపీటీసీ స్థానాలు 123 ఉన్నయి. ప్రస్తుతం 127కు పెరిగాయి. 335 గ్రామ పంచాయతీల్లో 140 స్థానాల వరకు బీసీలకు కేటాయించే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ఈ మేరకు బీసీలకు ప్రభు త్వం పదవుల పరంగా పెద్ద పీట వేయనుందని రాజకీ య విశ్లేషకులు భావిస్తున్నారు. ముందుగా ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికలు నిర్వహిస్తారన్న ఊహాగానాలకు రాష్ట్ర వ్యాప్తంగా స్థానాలను ఖరారు చేయడం బలాన్ని చేకూరుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ని 335 గ్రామ పంచాయతీల్లో 3,48,368 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల కాలంలో కొత్త ఓటర్లు పెరిగి నట్లు చెబుతున్నారు. సర్పంచ్ ఎన్నికలు తర్వాత జరిగే అవ కాశం ఉన్నది. సెప్టెంబరు 30 లోపు అన్ని స్థానిక ఎన్ని కలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.
Updated Date - Jul 19 , 2025 | 11:19 PM